నేతాజీ జయంతి వేడుకలు, రాష్ట్రపతి భవన్‌లో నేతాజీ చిత్రపటం ఆవిష్కరణ

Kovind Unveils Portrait of Netaji Subhas Chandra Bose, Mango News, Netaji Subhas Chandra Bose, Netaji Subhas Chandra Bose Portrait, President Kovind unveils Netaji Subhas Chandra Bose portrait, President Ram Nath Kovind, President Ram Nath Kovind unveils portrait of Netaji, President Ramnath Kovind Unveils Portrait of Netaji, President unveils portrait of Subhas Chandra Bose, Rashtrapati Bhavan

భారత దేశ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ సైన్యం వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి ఈరోజు. ఇటీవలే నేతాజీ జన్మదినమైన జనవరి 23 వ తేదీని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ దివస్‌’గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేతాజీ జయంతి సందర్భంగా దేశం కోసం నేతాజీ చేసిన నిస్వార్థ సేవను దేశవ్యాపంగా నాయకులు, ప్రముఖులు, ప్రజలు స్మరించుకుంటూ ఘన నివాళులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతాజీ సుభాస్ చంద్రబోస్ చిత్రపటాన్ని రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు ఆవిష్కరించారు. నేతాజీ 125 వ జయంతి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభించిన సందర్భంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

అలాగే నేతాజీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. నేతాజీ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని, భరతమాత నిజమైన ముద్దుబిడ్డ అంటూ కొనియాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన త్యాగం మరియు చూపిన అంకితభావాన్ని దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 19 =