కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం, ఇకపై రాత్రి వేళల్లో కూడా పోస్టుమార్టం

Autopsy can be conducted after sunset, Centre allows post-mortem after sunset in hospitals, Health ministry allows post-mortems at night, Health Ministry Notifies New Protocol, Health Ministry notifies new protocol for post-mortem procedure, Mango News, Now autopsy can be done after sunset, Post-mortem Can Now Be Performed After Sunset, Post-mortem now allowed to be conducted past sunset, Post-Mortem Now Allowed to be Performed after Sunset, Union Health Ministry notifies new protocol

దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పోస్టుమార్టం విధానంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పగటిపూట మాత్రమే పోస్టుమార్టం నిర్వహణకు అనుమతి ఉండగా, నవంబర్ 15, 2021 నుంచి సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టం ప్రక్రియను నిర్వహించడానికి ప్రోటోకాల్‌లు అనుమతించబడతాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో మౌలిక సదుపాయాలు ఉన్న ఆసుపత్రులలో సూర్యాస్తమయం తర్వాత కూడా అనగా 24 గంటలు పోస్టుమార్టం నిర్వహించడానికి అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. వివిధ వనరుల నుండి అందిన పలు సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ కొత్త విధానం అవయవ దానం మరియు ట్రాంప్లాంట్ ను కూడా ప్రోత్సహిస్తుందని, ఎందుకంటే ప్రక్రియ తర్వాత నిర్ణీత సమయంలో అవయవాలను సేకరించవచ్చని తెలిపారు.

కాగా పోస్టుమార్టం నిర్వహించే ఆసుపత్రుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఫిట్‌నెస్ మరియు సమర్ధత మొదలైనవాటిని ఆసుపత్రి-ఇన్‌చార్జి అంచనా వేయాలని, సాక్ష్యం విలువను తగ్గించడానికి అవకాశం లేకుండా చూడాలన్నారు. అలాగే రాత్రిపూట నిర్వహించబడిన అన్ని పోస్టుమార్టం ప్రక్రియలు వీడియో రికార్డింగ్ చేయబడుతుందన్నారు. ఏదైనా అనుమానాన్ని తోసిపుచ్చడానికి మరియు చట్టపరమైన ప్రయోజనాల కోసం, భవిష్యత్తు అవసరాలకై భద్రపరచబడే వీడియో రికార్డింగ్ ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే హత్య, ఆత్మహత్య, అత్యాచారం, కుళ్ళిపోయిన మృతదేహాలు, అనుమానాస్పదమైన ఫౌల్ ప్లే వంటి కేటగిరీల్లో శాంతిభద్రతల పరిస్థితి ఉంటే తప్ప రాత్రి సమయంలో పోస్టుమార్టం నిర్వహించకూడదని పేర్కొన్నారు. పోస్టుమార్టం ప్రక్రియలో ఈ ప్రోటోకాల్ మార్పుగురించి అన్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లు మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేయబడిందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + eighteen =