తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

AP Local Bodies Quota MLC Elections, Election Commission Notification For MLC Elections, Local Bodies Quota MLC Elections, Local Bodies Quota MLC Elections In Telangana, Local body MLC Polls, Mango News, Notification for Local Bodies Quota MLC Elections In Telangana, Notification Released for Local Bodies Quota MLC Elections, Telangana Local Bodies Quota MLC Elections, Telangana Notification Released for Local Bodies Quota MLC Elections

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు (నవంబర్ 16, మంగళవారం) నోటిఫికేషన్ విడుదల అయింది. దీంతో నేటి నుంచి నవంబర్ 23 వ‌ర‌కు అభ్యర్థుల నుంచి నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఇక నామినేషన్ల పరిశీలన నవంబర్ 24న చేపట్టనుండగా, ఉపసంహరణకు నవంబర్ 26 వరకు అవకాశమిచ్చారు. ఇక డిసెంబర్ 10వ తేదీన ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 1 =