కొవాగ్జిన్‌ ధరపై నిర్ణయం, రాష్ట్రప్రభుత్వాలకు రూ.600, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1200

Bharat Biotech, Bharat Biotech Announces Covaxin Price, Bharat Biotech announces Covaxin prices, Bharat Biotech announces price of Covaxin, Bharat Biotech Covaxin, Bharat Biotech Covaxin Price, Bharat Biotech COVAXIN to Cost Rs 600 For State Govts, Covaxin Price, Covaxin Price 1200 Per Dose for Private Hospitals, Covaxin Price 600 for State Govt, Covaxin price for state hospitals private hospitals, Mango News, Rs 1200 Per Dose for Private Hospitals and Rs 600 for State Govts

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశగా కేంద్రప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. అలాగే వ్యాక్సిన్ తయారీ కంపెనీలు నెలవారీగా విడుదల చేసే డోసులలో 50% కేంద్రప్రభుత్వానికి, మిగిలిన 50% డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు బహిరంగ మార్కెట్ కు ఇచ్చేలా అధికారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, కొవాగ్జిన్‌ కరోనా వ్యాక్సిన్ ధరలను భారత్ బయోటెక్ సంస్థ శనివారం నాడు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసుకు రూ.600 చొప్పున మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక్కో డోసుకు రూ.1200 చొప్పున కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ డోసులను విక్రయించనున్నట్టు వెల్లడించింది. అలాగే విదేశాలకు ఎగుమతి చేసే వ్యాక్సిన్ ధర ఒక్కో డోసుకు 15 నుంచి 20 డాలర్లు మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా.కృష్ణా ఎం.ఎల్లా ఒక ప్రకటన విడుదల చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 7 =