పంజాబ్ రాష్ట్రంలో వీకెండ్ లాక్‌డౌన్‌ పొడిగింపు, రాత్రి 7 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమలు

Punjab, Punjab Coronavirus, Punjab Coronavirus News, Punjab Extend Lockdown, Punjab Govt Decided to Impose weekend Lockdown, Punjab Impose weekend Lockdown, Punjab Lockdown, Punjab Lockdown Extented, Punjab weekend Lockdown, weekend Lockdown Punjab

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 167 నగరాలు మరియు పట్టణాల్లో వీకెండ్ లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగించింది. అలాగే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కూడా అమలు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 31 వరకు వివాహాలు, అంత్యక్రియలు మినహా ఇతర సామూహిక కార్యక్రమాలు జరపడంపై నిషేధం విధించినట్టు పేర్కొన్నారు. గవర్నమెంట్, ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో నడుస్తాయని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడకుండా కరోనా వైరస్ తో పోరాడాల్సి ఉందని, రాష్ట్రంలో ప్రతి కరోనా మరణం తనను బాధించిందని సీఎం అమరీందర్‌ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆగస్టు 20 నాటికీ పంజాబ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,824 కు చేరుకుంది. వీరిలో 23,037 మంది కోలుకోని డిశ్చార్జ్ అవగా, 957 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 13,830 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =