పారాలింపిక్స్ లో స్వర్ణ పతక విజేత అవని లేఖరాకు రూ.3 కోట్ల నగదు బహుమతి

Avani Lekhara bagged a Gold medal for India at the Tokyo Paralympics, Avani Lekhara Wins Gold Medal in Shooting Event, Bhavina Patel & Nishad Kumar win silver medals, Gold medal for India at the Tokyo Paralympics, India Secures 7 Medals Including Gold, India’s Avani Lekhara Wins Gold Medal in Shooting Event, Mango News, Paralympic Gold Medal Winner Avani Lekhara, Rajasthan Govt Announces Rs 3 Crore Cash Reward for Paralympic Gold Medal Winner Avani Lekhara, Tokyo Paralympics, Tokyo Paralympics 2020 Live Updates, Tokyo Paralympics 2021, Tokyo Paralympics 2021 Live

టోక్యో పారాలింపిక్స్ లో సోమవారం నాడు భారత్ అథ్లెట్స్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అవని లేఖరా, దేవేంద్ర ఝజారియా, సుందర్‌ సింగ్‌ గుర్జార్ పారాలింపిక్ పతక విజేతలుగా నిలిచారు. షూటింగ్ (10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌) విభాగంలో అవని లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, జావెలిన్ త్రోలో (F46 ఈవెంట్) దేవేంద్ర ఝజారియా రజతం పతకం, సుందర్‌ సింగ్‌ గుర్జార్ కాంస్య పతకం సాధించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు పారాలింపిక్ పతక విజేతలను అభినందించారు. అలాగే వారికీ నగదు బహుమతులు ప్రకటించారు. స్వర్ణ పతాకాన్ని సాధించిన అవని లేఖరాకు రూ.3 కోట్లు, రజతం పతక విజేత దేవేంద్ర ఝజారియాకు రూ.2 కోట్లు, కాంస్యపతక విజేత సుందర్‌ సింగ్‌ గుర్జార్ కు రూ.1 కోటి చొప్పున అందించనున్నట్టు సీఎం అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

అలాగే ముగ్గురు ఆటగాళ్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(ఏసీఎఫ్) పోస్టుకు నియమించబడ్డారని చెప్పారు. రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించడం ద్వారా దేశం మరియు రాష్ట్రానికి పేరు తెచ్చారని, వారు సాధించిన ఘనత పట్ల గర్వపడుతున్నామని సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. అదేవిధంగా సోమవారం పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 విభాగంలో లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న యోగేశ్ కధూనియాను కూడా అశోక్ గెహ్లాట్ ప్రశంసించారు. వీరందరి తమ విజయాల పట్ల దేశం చాలా గర్వపడేలా చేశారని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =