ఆర్బీఐ సంచలన ప్రకటన.. రూ. 2,000 నోటు ఉపసంహరణ, సెప్టెంబరు 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్‌కు అవకాశం

RBI Orders All Banks To Stop Circulation of Rs 2000 Denomination Notes Gives Exchange Time For People From May 23 Sept 30,RBI Orders All Banks To Stop Circulation of Rs 2000,Banks To Stop Circulation of Rs 2000 Denomination Notes,RBI Gives Exchange Time For People From May,Circulation of Rs 2000 From May 23 Sept 30,Mango News,Mango News Telugu,RBI on 2000 Rupee note,Rs 2000 notes go out of circulation,RBI to withdraw Rs 2000 notes,Reserve Bank of India,Rs 2000 Notes To Be Withdrawn,RBI Latest News,RBI Latest Updates,2000 Note Circulation News Today,2000 Note Circulation Latest Updates

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం రాత్రి సంచలన ప్రకటన చేసింది. 2016లో నోట్ల రద్దు అఞ్ఞతరం చలామణీలోకి తెచ్చిన రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రూ.2 వేల నోట్లు జారీ చేయడాన్ని ఆపేయాలని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిర్ణీత కాలపరిధిలో రూ. 2,000 కరెన్సీ నోటు ఉపయోగంలో లేకుండా చేసేందుకు గానూ ఎవరి వద్దనైనా ఈ నోట్లు ఉంటే వాటిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి లేదా మార్చుకోవడానికి వీలుగా సెప్టెంబరు 30 వరకూ సమయం ఇచ్చింది. మంగళవారం (మే 23, 2023) నుంచి సెప్టెంబరు 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను రూ.20 వేల పరిమితికి మించకుండా మార్చుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. అయితే బ్యాంకుల్లో డిపాజిట్లు మాత్రం నిబంధనల ప్రకారమే తీసుకోబడతాయని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఇలా పేర్కొంది.. 2016 నవంబరులో అప్పటికి చలామణీలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరించుకున్న నేపథ్యంలో.. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ కరెన్సీలోటును వేగంగా పూరించడానికి ఆర్బీఐ చట్టం, 1934లోని సెక్షన్‌ 24(1) కింద రూ.2 వేల నోటును ప్రవేశపెట్టాం. అనంతరకాలంలో ఇతర డినామినేషన్లలో నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి రావడంతో.. రూ.2 వేల నోటును ప్రవేశపెట్టిన ప్రయోజనం నెరవేరింది. ఫలితంగా 2018–19 నుంచి ఆ నోట్ల ముద్రణను నిలిపివేశాం. అందుబాటులో ఉన్న ఇతర డినామినేషన్ల నోట్లు దేశంలోని ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోతాయి. ఈ నేపథ్యంలో.. మా (ఆర్బీఐ) ‘క్లీన్‌ నోట్‌ పాలసీ’లో భాగంగా రూ.2000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించాలని నిర్ణయించాం. అయితే.. ఈనోట్లు చలామణీలో ఉంటాయి. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం డిపాజిట్‌ చేయొచ్చు (లేదా) ఏ బ్యాంకు శాఖలోనైనా ఇతర డినామినేషన్‌ నోట్లతో వాటిని మార్చుకోవచ్చు’ అని తెలియజేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here