ప్రముఖ సినీనటుడు, డీఎండీకే అధినేత విజయ‌కాంత్‌కు కరోనా పాజిటివ్‌

Actor Vijayakanth tests COVID-19 positive, Coronavirus, DMDK chief Vijayakant tests positive, DMDK Chief Vijayakanth Tests Positive, DMDK Chief Vijayakanth Tests Positive for Covid-19, Vijayakant Corona, Vijayakanth Tests Positive, Vijayakanth tests positive for coronavirus, Vijayakanth tests positive for COVID 19

కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే నాయకుడు విజయ‌కాంత్‌ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన మియోట్‌ ఇంటర్నేషనల్‌ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. తేలికపాటి లక్షణాలు కనపడడంతో, ఆయన హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారని మియోట్‌ ‌ హాస్పిటల్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన పూర్తిస్థాయిలో కోలుకుంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eleven =