అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.1,800 కోట్లు వ్యయం.. రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు అంచ‌నా!

Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust Estimates Total Cost Rs 1800 Cr For The Ayodhya Mandir Construction, Ayodhya Ram Temple Estimated Cost of Rs 1800 Cr, Ram Mandir Estimation Cost 1800cr, Ram Mandir Project Cost 1800 Cr, Ayodhya Ram Temple, Mango News, Mango News Telugu, Shri Ram Janmabhoomi, Construction of Ram temple in Ayodhya, Ayodhya Ram Mandir Project Construction, Ayodhya Ram Mandir Latest News And Updates, Ayodhya Ram Mandir, Ayodhya Mandir Construction News And Live Updates, Shri Ram Janmabhoomi Teerth Kshetra

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ప్రసిద్ధ రామమందిర నిర్మాణం కోసం అయ్యే వ్యయం మొత్తం రూ.1800 కోట్లుగా నిర్ణయించారు. ఈ మేరకు మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ‘శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు’ తాజాగా నిర్ణయించింది. ఆదివారం ఫైజాబాద్ సర్క్యూట్ హౌసులో జరిగిన శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిపుణులు అందించిన నివేదికల పరిశీలన అనంతరం ఆలయ నిర్మాణానికి రూపొందించిన ప్రణాళిక మేరకు దాదాపు రూ.1800 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇక ఆలయంలో సనాతన హిందూ సంప్రదాయాల ప్రకారం విగ్రహాల ఏర్పాటుకు ట్రస్టు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అలాగే రామాయ‌ణ కాలం నాటి ప్ర‌ధాన పాత్రలకు సంబంధించిన విగ్రహాల ఏర్పాటు కూడా చేయనున్నారు.

కాగా 2023 చివరి నాటికి నాటికి రామాల‌య నిర్మాణం పూర్తి అవ్వొచ్చని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. 2024 జనవరి మకర సంక్రాంతి నాటికి రాముడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రస్టు సభ్యులు ప్రకటించారు. అయోధ్యలో నిర్మిస్తున్న నూతన రామాలయం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా భక్తుల సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులైన నిర్మాణ కమిటీ ఛైర్మన్ నుపేంద్ర మిశ్రా, కేశవ్ పరాశరన్, యుగ్పురుష్ పరమానంద్, విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరియు ఎక్స్ అఫీషియో సభ్యుడు జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్, మరో ఎక్స్ అఫీషియో సభ్యుడు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here