శ్రీలంక సంక్షోభం: అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా, వారంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక!

Sri Lanka Crisis Speaker Officially Announces Gotabaya Rajapaksa's Resigns as President, Sri Lanka Speaker Officially Announces Gotabaya Rajapaksa's Resigns as President, Gotabaya Rajapaksa's Resigns as President, Gotabaya Rajapaksa Submits Resignation As Sri Lankan President, Resignation As Sri Lankan President, Gotabaya Rajapaksa Submits Resignation, Sri Lankan President, Sri Lanka Speaker, President Gotabaya Rajapaksa Signs Resignation Letter, Gotabaya Rajapaksa Signs Resignation Letter, Sri Lanka President Gotabaya Rajapaksa, President Gotabaya Rajapaksa, Gotabaya Rajapaksa, Sri Lanka Economic Crisis News, Sri Lanka Economic Crisis Latest News, Sri Lanka Economic Crisis Latest Updates, Sri Lanka Economic Crisis Live Updates, Mango News, Mango News Telugu,

దేశం విడిచి పరారైన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు ప్రజాగ్రహానికి తలొంచారు. పలు నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు గొటబాయ శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద అబేవర్దన్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం గొటబాయ సింగపూర్ దేశంలో తలదాచుకున్నారు. ఈ క్రమంలో నిన్న ఆయన తన రాజీనామా లేఖను శ్రీలంక స్పీకర్‌ కార్యాలయానికి ఇమెయిల్ ద్వారా పంపారు. గురువారం రాత్రి సింగపూర్‌లోని శ్రీలంక హైకమిషన్ ద్వారా రాజపక్స రాజీనామా లేఖను స్పీకర్ స్వీకరించారు.

దీంతో స్పీకర్ అబేవర్దన్, అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసినట్లు శుక్రవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. మరో వారం రోజుల్లో నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటామని, అప్పటివరకు ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని స్పీకర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అయితే మరో 7 రోజుల్లో పూర్తి చేసే ఈ ప్రక్రియలో చట్టసభ సభ్యులందరూ పాల్గొనేలా దేశంలో శాంతియుత వాతావరణం కల్పించాలని స్పీకర్ ప్రజలను కోరారు. కాగా శ్రీలంక పార్లమెంటు శనివారం సమావేశం కానుంది. గత శనివారం, రాజపక్స తన అధికారిక నివాసాన్ని వేలాది మంది నిరసనకారులు ముట్టడించిన అనంతరం దేశం సరిహద్దులకు పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా మాల్దీవులకు పారిపోయారు. మాల్దీవుల నుంచి ఆయన గురువారం సింగపూర్ వెళ్లారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =