నేటి నుంచి నాలుగు రోజులపాటు శ్రీలంక ప్రధాని భారత పర్యటన

Mango News Telugu, national news, PM Mahinda Rajapaksa, PM Modi, prime minister of sri lanka, Sri Lanka, Sri Lanka PM India Visit, Sri Lanka PM Mahinda Rajapaksa, Sri Lanka Prime Minister, Sri Lankan PM reach New Delhi
శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సే నేటి నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజపక్సే నాలుగు రోజులపాటు భారత్‌లో ఉండనున్నారు. వాణిజ్యం, రక్షణ, సముద్ర తీర భద్రతా సహకారంతో పాటుగా పలు ఇతర అంశాలపై భారత ప్రతినిధులతో ఆయన చర్చలు జరుపనున్నారు. మహిందా రాజపక్సే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక తోలి విదేశీ పర్యటనగా భారత్ చేరుకున్నారు. భారత్-శ్రీలంక దేశాల మధ్య ఇప్పటికే ఉన్న బలమైన సంబంధాన్ని ఈ పర్యటన మరింత పెంచుతుందని శ్రీలంక ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గత నవంబర్ లో శ్రీలంక రాష్ట్రపతి గోటబయ రాజపక్సే న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించిన 450 మిలియన్ డాలర్ల రుణం హామీ అమలును ఖరారు చేసుకోవాలని ప్రధాని మహీంద భావిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో వారణాసి, సారనాథ్, బోధగయ, తిరుపతి వంటి ఆలయాలను కూడా మహీంద సందర్శించే అవకాశం ఉంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − five =