జనవరి నెలలో భారీగా జీఎస్టీ ఆదాయం, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే రెండో అత్యధిక వసూలు

Rs 155922 Cr GST Revenue Collected in Month of January 2023 Second Highest Collection Ever,Gst Revenue Meaning,Gst Collection 2023 List,Gst Collection Month Wise 2023,Gst Collection Year Wise,Mango News,Mango News Telugu,Gst Impact On State Revenue,Gst On Revenue Sharing Agreement,Gst On Unbilled Revenue,Gst Revenue,Gst Revenue By State,Gst Revenue Collection,Gst Revenue Collection Month Wise,Gst Revenue Collection State Wise,Gst Revenue State Wise,India Gst Revenue,State Share Of Gst Revenue

దేశంలో జనవరి నెలలో భారీగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) ఆదాయం నమోదైంది. జనవరిలో (31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు) రూ.1,55,922 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇది రెండో అత్యధిక ఆదాయంగా నిలిచింది. 2022, ఏప్రిల్ నెలలో మొత్తం రూ.1,67,540 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదై అత్యధిక ఆదాయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే దాని తర్వాత మళ్ళీ 2022, అక్టోబర్ లో రూ.1,51,718 కోట్ల జీఎస్టీ వసూళ్లు రాగా, తాజాగా దాన్ని అధిగమిస్తూ 2023, జనవరి నెలలో రూ.1,55,922 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదై రెండో అత్యధికంగా మారింది.

అలాగే 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్, అక్టోబర్, జనవరి నెలల్లో మూడుసార్లు స్థూల జీఎస్టీ సేకరణ రూ.1.50 లక్షల కోట్ల మార్క్ దాటింది. మరోవైపు 2023, జనవరిలో నమోదైన జీఎస్టీ వసూళ్ల 2022, జనవరి కంటే 24% ఎక్కువని పేర్కొన్నారు. జనవరి లో సీజీఎస్టీ వసూళ్లు రూ.28,963 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.36,730 కోట్లు, ఐజీఎస్టీ రూ.79,599 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.37,118 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ.10,630 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన రూ.768 కోట్లతో కలిపి) గా నమోదయ్యాయి. ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సీజీఎస్టీకి రూ.38,507 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీకి రూ.32,624 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత 2023, జనవరి నెలలో కేంద్రం మరియు రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.67,470 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీకి రూ.69,354 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 9 =