నిమ్స్ లో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థి ప్రీతిని పరామర్శించిన మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao Visited Nims To Enquire About The Health Condition Of Pg Medical Student Preethi, Minister Harish Rao Nims Visit, Harish Rao Enquire About Student Preethi, Pg Medical Student Preethi Health Condition, Mango News, Mango News Telugu, Nims Hospital Hyderabad,Nims Hospital Panjagutta Contact Number,Warangal News,Warangal News Live,Warangal News Today English,Warangal News Today Telugu,Warangal Newspaper Today, T Harish Rao Contact Number,T Harish Rao Email Address,T Harish Rao Office Address,T Harish Rao Portfolio,T Harish Rao Twitter,T Harish Rao Wife,Tanneru Harish Rao

వరంగల్‌ లో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ప్రస్తుతం పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు శుక్రవారం రాత్రి నిమ్స్ కు చేరుకొని, వైద్య విద్యార్థి ప్రీతిని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ప్రీతి కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు.

ప్రీతి త్వరగా కోలుకునేలా చూసేందుకు సాధ్యమైనంత ఉత్తమమైన హెల్త్ కేర్ సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని, అత్యుత్తమ వైద్యం అందించి, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆసుపత్రిలోని సీనియర్ ఆరోగ్య అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, విచారణ నివేదిక రాగానే ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − eight =