తమిళనాడులో లాక్‎డౌన్ ఎఫెక్ట్ – రోడ్లన్నీ నిర్మానుష్యం

Tamil Nadus Complete Lockdown Effects On Sunday, Tamil Nadu, Complete Lockdown, Complete Lockdown Effects, Lockdown, Lockdown Updates, Lockdown Live Updates, Tamil Nadu Complete Lockdown, complete lockdown rules, complete lockdown New rules, complete lockdown on Sundays, Tamil Nadu lockdown rules latest, Sunday lockdown in tamilnadu, Mango News, Mango News Telugu, Tamil Nadu lockdown, lockdown in tamil nadu, Tamil Nadu lockdown news,

తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం కఠిన నిబంధనలతో కూడిన లాక్‌డౌన్‌ సంపూర్ణంగా అమలైంది. కరోనా నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. దీనికి తోడు ఆదివారం కఠిన నిబంధనలతో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేశారు. చెన్నై సహా మిగిలిన పెద్ద నగరాలు బోసిపోయి కనిపించాయి. ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో జనజీవనం స్తంభించింది. ఆదివారం వేకువజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ కనిపించింది. గత మూడు రోజులుగా.. రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇంచుమించు ఆరుమాసాల తర్వాత రాష్ట్రంలో కఠిన నిబంధనలతో మళ్ళీ సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేశారు.

తమిళనాడు రాఫ్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ సందర్భంగా.. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రజలు ఇళ్ళలోనే గడిపారు. చిన్న చిన్న కిరాణా దుకాణాలు మొదలుకొని పెద్ద సూపర్‌ మార్కెట్ల దాకా అన్నీ మూతపడ్డాయి. వాణిజ్య సంస్థలు, వస్త్ర, నగల దుకాణాలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, కాయగూరలు, మాంసం దుకాణాలు మూతపడటంతో జనం లేక బోసిపోయాయి. చెన్నై నగరంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలు చేయడానికి 15 వేల మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. కరోనా కారణంగా అమలవుతున్న లాక్‎డౌన్ నేపథ్యంలో.. ఆస్పత్రులు, పెట్రోల్‌ బంకుల సిబ్బంది, పాత్రికేయులు, పాలు పంపిణీ చేసేవారు మాత్రమే బయట తిరిగేందుకు అనుమతించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 4 =