మంచులో మునిగిన జమ్ము, కశ్మీర్ – పలు విమానాలు బంద్

Heavy Snowfall Effect Many Flights Cancelled In Jammu And Kashmir, Heavy Snowfall Effect, Flights Cancelled In Jammu And Kashmir, Flights Cancelled, Kashmir witnessed heavy snowfall, snowfall affects air traffic, Snowfall hampers, Flight Operations Delayed, Srinagar flight status today, Snowfall in Kashmir, Srinagar airport flights cancelled Today, Mango News, Mango News Telugu, Jammu And Kashmir weather, Jammu And Kashmir weather updates, Heavy Snowfall In Jammu And Kashmir,

జమ్ము, కశ్మీర్ లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. గడ్డ కట్టిస్తున్న చలి కారణంగా నివాసిత ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కశ్మీర్ లోయలోని చాలా ప్రదేశాలలో విపరీతమైన మంచు కురుస్తుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న హిమపాతం కారణంగా.. లోయ మొత్తం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివలన జమ్ము, కాశ్మీర్ మరియు దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య విమాన రాకపోకలు రద్దు చేయబడ్డాయి అని అధికారులు తెలిపారు. కాశ్మీర్‌లోని మైదానాల్లో తేలికపాటి నుండి మోస్తరు మంచు కురుస్తుంది. లోయలోని ఎత్తైన ప్రాంతాలలో చాలా భారీగా హిమపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

శ్రీనగర్ నగరంలో.. గుల్మార్గ్, ఉత్తర కాశ్మీర్‌లోని ప్రసిద్ధ స్కీ-రిసార్ట్, దక్షిణాన ఖాజిగుండ్ పట్టణం, షోపియాన్ లలో భారీగా హిమపాతం నమోదైంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. ప్రతికూల వాతావరణం కారణంగా.. శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. “నిరంతర హిమపాతం మరియు తక్కువ దృశ్యమానత కారణంగా, శ్రీనగర్ విమానాశ్రయంలో ఇప్పటివరకు ఎటువంటి విమాన కార్యకలాపాలు జరగలేదు. మంచు నుండి రన్‌వే క్లియర్ చేయబడి, పరిస్థితులు మెరుగుపడిన తర్వాత విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.” అని వారు చెప్పారు.

ప్రస్తుతం ఈ ప్రాంతంలో.. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అనేక ప్రాంతాల నుండి మంచు ఇంకా తొలగించబడలేదని అనేక మంది నివాసితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మైనస్ ఉష్ణోగ్రతల కారణంగా.. నగరంలో మరియు ఇతర ప్రాంతాలలో చాలా ప్రదేశాలలో మంచు తొలగింపు ఆలస్యంగా ఉంది. భారీ హిమపాతం.. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాపై కూడా ప్రభావం చూపింది. ఇక్కడ, నగరంలోని చాలా చోట్ల బ్రాడ్‌బ్యాండ్ మరియు ఫైబర్ ఇంటర్నెట్ లైన్‌లు కూడా స్టాప్ చేయబడ్డాయి. భారీ హిమపాతం కారణంగా.. సర్వీస్ ప్రొవైడర్లు ఎటువంటి సాంకేతిక అభ్యర్థనలను తీసుకోవడం లేదని అధికారులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − three =