ఎయిర్ ఇండియా కొత్త సీఈవో అండ్ ఎండీగా క్యాంప్‌బెల్ విల్సన్ నియామకం

Tata Sons Appointed Campbell Wilson as New Chief Executive Officer and Managing Director of Air India, Tata Sons Appointed Campbell Wilson as New Managing Director of Air India, Tata Sons Appointed Campbell Wilson as New Chief Executive Officer of Air India, Campbell Wilson as New Chief Executive Officer of Air India, Campbell Wilson as New Managing Director of Air India, New CEO of Air India, New MD of Air India, Air India, Tata Sons, Tata Sons appoints Campbell Wilson as CEO & MD of Air India, Air India's New Managing Director And CEO Is Campbell Wilson, Tata Sons appoints Campbell Wilson as new Air India CEO And MD, Tata Sons appoints Scoot chief Campbell Wilson as new Air India CEO And MD, Air India News, Air India Latest News, Air India Latest Updates, Air India Live Updates, Mango News, Mango News Telugu,

ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) మరియు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా క్యాంప్‌బెల్ విల్సన్ నియమితులయ్యారు. ఈ మేరకు టాటా సన్స్ సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సీఈవోగా క్యాంప్‌బెల్ విల్సన్ నియామకాన్ని ఎయిర్ ఇండియా బోర్డు ఆమోదించినట్టు తెలిపారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు చెందిన స్కూట్ సీఈవో అయిన విల్సన్ కు ఏవియేషన్ ఇండస్ట్రీలో 26 సంవత్సరాల అనుభవం ఉన్నట్టు తెలిపారు. టాటా సన్స్ అండ్ ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, ఎయిరిండియా సీఈవోగా విల్సన్ నియామకాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను నిర్మించడం కోసం అతనితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని అన్నారు.

ముందుగా టాటా గ్రూప్ బిడ్‌ గెలుచుకుని ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి దక్కించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం గత ఫిబ్రవరిలో ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవోగా టర్కీ ఎయిర్‌లైన్స్ మాజీ సీఈవో ఇల్కర్ ఐసీని నియమించేందుకు బోర్డు ఆమోదం తెలుపగా, టాటాసన్స్ ప్రకటన చేసింది. అయితే అధికారికంగా బాధ్యతలు చేపట్టకముందే ఆ పదవీ స్వీకరించేందుకు నిరాకరిస్తునట్టు ఇల్కర్ ఐసీ ప్రకటించారు. ఆ నియామకం వివాదాస్పదం కావడంతో కొత్త సీఈవో కోసం టాటా గ్రూప్ కీలక సంప్రదింపులు జరిపింది. తాజాగా ఈ రంగంలో పలు ప్రపంచ మార్కెట్లలో పనిచేసిన అనుభవజ్ఞుడైన క్యాంప్‌బెల్ విల్సన్ ను సీఈవో గా నియమిస్తూ టాటా సన్స్ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =