పశ్చిమబెంగాల్ లో రిక్రూట్‌మెంట్ స్కామ్‌, మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు

Teacher Recruitment Scam in West Bengal Minister Partha Chatterjee Detained by ED Officials, West Bengal Minister Partha Chatterjee Detained by ED Officials, Minister Partha Chatterjee Detained by ED Officials, Partha Chatterjee Detained by ED Officials, Teacher Recruitment Scam in West Bengal, West Bengal Teacher Recruitment Scam, Teacher Recruitment Scam, West Bengal Minister Partha Chatterjee, Minister Partha Chatterjee, ED Officials, West Bengal Minister, Partha Chatterjee, West Bengal, West Bengal Teacher Recruitment Scam News, West Bengal Teacher Recruitment Scam Latest News, West Bengal Teacher Recruitment Scam Latest Updates, West Bengal Teacher Recruitment Scam Live Updates, Mango News, Mango News Telugu,

పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ మరియు పశ్చిమబెంగాల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్‌లో రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం శుక్రవారం వివిధ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాల్లో భాగంగా పశ్చిమబెంగాల్ మంత్రి మరియు తృణమూల్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన నివాసాల్లో ఒకదాని నుంచి రూ.20 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఈ స్కామ్ కేసుకు సంబంధించి పశ్చిమబెంగాల్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పార్థా ఛటర్జీని కోల్‌కతాలోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ స్కామ్ కు సంబంధించి మంత్రి పార్థా ఛటర్జీని 26 గంటల పాటు ప్రశ్నించామని, అధికారులకు సహకరించక పోవడంతో అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లామన్నారు. ఈ రోజు సాయంత్రం మంత్రిని కోర్టు ముందు హాజరుపరిచే అవకాశమున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు అర్పితా ముఖర్జీని కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ముందుగా ఈ స్కామ్ చోటుచేసుకున్నప్పుడు పార్థా ఛటర్జీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ స్కామ్ కు సంబంధించి కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ స్కామ్ లో మనీలాండరింగ్ కోణంపై ఈడీ విచారణ జరుపుతుంది. అందులో భాగంగానే పలుచోట్ల సోదాలు నిర్వహించి, సంబంధిత ఆరోపణలతో మంత్రి పార్థా ఛటర్జీని అదుపులోకి తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =