టోక్యో ఒలింపిక్స్‌ లో పీవీ సింధు సంచలనం, కాంస్యం పతకం కైవసం

Badminton Player PV Sindhu, India’s Star Badminton Player PV Sindhu Wins Bronze Medal, Mango News, PV Sindhu Bronze Tokyo Olympics win Badminton, PV Sindhu wins bronze, PV Sindhu Wins Bronze Medal, PV Sindhu wins historic bronze for India, PV Sindhu wins historic bronze for India at Tokyo Olympics, Sindhu Wins Bronze Medal, Tokyo Games, Tokyo Olympics, Tokyo Olympics 2020

టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆదివారం సాయంత్రం బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ లో భాగంగా కాంస్య పతకం కోసం చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో జరిగిన పోరులో పీవీ సింధు పూర్తి ఆధిపత్యంతో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. హి బింగ్జియావోపై 21-13, 21-15 తేడాతో పీవీ సింధు అద్భుత విజయాన్ని సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు, టోక్యో ఒలింపిక్స్‌ లో కాంస్యం సొంతం చేసుకుని వరుసగా రెండు ఒలింపిక్స్‌ లో వ్యక్తిగత పతకాలు సాధించిన తోలి భారతీయ క్రీడాకారిణిగా సింధు సరికొత్త రికార్డు సృష్టించింది.

ఒలింపిక్స్ లో కాంస్యం పతకం సాధించి భారత్ కు రెండో పతకం అందించిన పీవీ సింధుకు పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటుగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాజకీయనాయకులు, క్రీడా, సినీరంగ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా పీవీ సింధుపై ప్రశంసలు కురిపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here