ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘మాస్క్‌ తప్పనిసరి, ధరించకపోతే జరిమానా’ ఆంక్షలు ఎత్తివేత

Delhi Govt Lifts The Rule of Rs 500 Fine For Not Wearing Face Masks in Public Places, Delhi Govt Lifts The Rule of Face Masks, Face Masks Fine Lifted In Delhi, 500 Fine For Not Wearing Face Masks, Mango News,Mango News Telugu, Delhi Government,Delhi Face Masks in Public Places, Delhi Face Masks Rule, Delhi Face Masks Not Wearing, Delhi Masks Not Wearing, Masks Not Wearing, Delhi Latest News And Updates,

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, ధరించకుంటే రూ.500 జరిమానా విదించబడుతుంది’ అన్న నిబంధనలను ఎత్తివేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ గత నెల సెప్టెంబరు 22న నిర్వహించిన సమావేశంలో కోవిడ్-19 కేసుల తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సెప్టెంబర్ 30 తర్వాత జరిమానా విధించడాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇంకా ఈ సమావేశంలో అథారిటీ, కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ యొక్క పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, అలాగే జనాభాలో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌లు వేయబడినందున ఈ నిబంధనలను ఉపసంహరించుకోవాలని సూచించింది. దీనిలో భాగంగా అంటువ్యాధి చట్టం ప్రకారం గతంలో విధించబడిన మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి అనే నిబంధనకు సెప్టెంబర్ 30 తర్వాత మినహాయంపు ఇవ్వాలని కోరింది. దీంతోపాటు మాస్క్‌లు ధరించనందుకు రూ. 500 జరిమానా కూడా ఉపసంహరించాలని చెప్పింది. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్-19 అదుపులో ఉన్నట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 1 =