ఇకపై సెల్​ఫోన్​లోనే నేరుగా టీవీ చూసే అవకాశం, త్వరలో డైరెక్ట్​-టు-మొబైల్​ ప్రసారాలు

TV on Your Smart Phone Without Internet Direct-to-Mobile Broadcasting Pilot Study in NCR Soon,TV On Your Smartphone,TV Smartphone Without Internet,TV Direct-to-Mobile Broadcasting,TV Mobile Broadcasting,Mango News,Mango News Telugu,TV on Mobile Without Internet,Direct-To-Mobile Broadcasting,Pilot Study In NCR Soon,TV To Mobile Without Internet,TV Without WiFi,NCR soon,NCR Corporation,NCR Latest News and Updates,Smart Phone News And Live Updates

నేటి ఆధునిక యుగంలో ఫోన్ వినియోగం తప్పనిసరి. ఇప్పటికే ఫోన్ లోని పలు యాప్‌ల ద్వారా వివిధ కార్యక్రమాలు చూస్తున్న వారికి కేంద్రం మరో శుభవార్త చెప్పింది​. ఇకపై అన్నిరకాల టీవీ కార్యక్రమాలనూ నేరుగా సెల్‌ఫోన్‌ లోనే చూసేలా కొత్త విధానాన్ని తీసుకురానుంది. దీనిలో భాగంగా ముందుగా పైలట్‌ ప్రాజెక్టుగా దేశ రాజధాని ప్రాంతంలో అమలు చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార మరియు ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర ప్రకటించారు. గురువారం ఢిల్లీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన బిగ్ పిక్చర్ సమ్మిట్‌కు హాజరైన అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. ఈ తరహా విధానం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నామని, ప్రస్తుతం టెలివిజన్ మానిఫోల్డ్‌ను విస్తరించే అవకాశం ఉన్న డైరెక్ట్-టు-మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్‌పై పైలట్ అధ్యయనం త్వరలో దేశ రాజధాని ప్రాంతంలో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.

టెలివిజన్ మీడియాకు డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ అనేది వీక్షకుల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నందున దీనిపై గత కొంతకాలంగా దృష్టి సారించామని అపూర్వ చంద్ర వెల్లడించారు. కాగా ప్రస్తుతం భారతదేశంలో టెలివిజన్ వినియోగిస్తున్న కుటుంబాలు దాదాపు 20 కోట్ల వరకు ఉన్నాయని, అయితే సుమారు 60 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మరియు 80 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఉన్నారని అపూర్వ చంద్ర తెలిపారు. అందుకే డైరెక్ట్-టు-మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్‌ వలన టెలివిజన్ మీడియా రీచ్ చాలా ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఐఐటీ-కాన్పూర్ మరియు సాంఖ్య ల్యాబ్స్ బెంగళూరులో డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్‌పై ప్రయోగాత్మకంగా అధ్యయనం చేశాయని, ఇప్పుడు నోయిడాలో లేదా ఢిల్లీకి సమీపంలోని ప్రదేశంలో మరో అధ్యయనాన్ని ప్రారంభించనున్నాయని చెప్పారు. ఇక టీఆర్పీ రేటింగ్స్ విషయంలోనూ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ రేటింగ్‌లలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున తాజాగా చేపట్టిన రివర్స్‌ పాత్‌ డేటా (ఆర్‌పీడీ)పై పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతమైందని, త్వరలోనే నివేదిక అందుబాటులోకి వస్తుందని ఆయన తెలియజేశారు.

ఇక వార్తాపత్రికల వంటి సాంప్రదాయ వనరుల నుండి సమాచారాన్ని వినియోగించడం కోసం కొత్త మీడియా వైపు మారడం ప్రభుత్వం ముందు విశ్వసనీయతకు సవాలుగా ఉందని, అలాగే యువత కొత్త మీడియా మూలాల నుండి సమాచారాన్ని వినియోగిస్తున్నందున ఇటీవల సాంప్రదాయ మీడియా నుండి మార్పు వచ్చిందని అపూర్వ చంద్ర అన్నారు. భారతదేశంలో 1.2 బిలియన్లకు పైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు మరియు 600 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మొబైల్ పరికరాల ద్వారా అధిక మొత్తంలో సమాచారం మరియు వినోదాన్ని వినియోగిస్తున్నారని చంద్ర చెప్పారు. ఇక డైరెక్ట్-టు-మొబైల్ టెక్నాలజీ ఎఫ్ఎం రేడియో మాదిరిగానే పనిచేస్తుందని, దీనిలో గాడ్జెట్‌లో నిర్మించిన రిసీవర్ రేడియో ఫ్రీక్వెన్సీలను యాక్సెస్ చేస్తుందని తెలిపారు. స్థానిక డిజిటల్ టీవీ ఫీడ్‌లను స్వీకరించడానికి మొబైల్ ఫోన్‌లను ఎనేబుల్ చేయడానికి బ్రాడ్‌బ్యాండ్ మరియు ప్రసార సాంకేతికతలు సంయుక్తంగా పనిచేస్తాయని, తద్వారా మల్టీమీడియా కంటెంట్ నేరుగా స్మార్ట్ ఫోన్‌లకు ప్రసారం చేయడానికి వీలు కలుగుతుందని అపూర్వ చంద్ర వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =