కేంద్రం కీలక నిర్ణయం, ఈడీ డైరెక్టర్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు

Centre Extends Tenure of Enforcement Directorate Director Sanjay Kumar Mishra by One Year,Centre Extends Tenure of ED Director,Director Sanjay Kumar Mishra,ED Director Extends One Year,Mango News,Mango News Telugu,Govt Extends Tenure Of ED,Centre Extends Enforcement Directorate,Enforcement Directorate,Enforcement Directorate Director,ED Director,ED Director Sanjay Kumar Mishra,Sanjay Kumar Mishra, Sanjay Kumar Mishra Latest News And Updates,ED News And Live Updates,Enforcement Directorate News And Updates

కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. “ఈడీ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని 2023, నవంబర్ 18 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (ఏది ముందైతే అది) పొడిగించడానికి కేంద్ర కేబినెట్
అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదించింది” అని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

1984 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి అయిన సంజయ్ కుమార్ మిశ్రా ముందుగా 2018, నవంబర్ 19 నుంచి రెండేళ్ల కాలానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. 2020లో మిశ్రా అపాయింట్‌మెంట్ లెటర్‌ను సవరిస్తూ అతని రెండేళ్ల పదవీకాలాన్ని మూడేళ్లకు మార్చారు. 2021లో రెండోసారి ఏడాది పాటు, తాజాగా మూడోసారి మరో ఏడాది పాటు మిశ్రా పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో ఈడీ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా వరుసగా ఐదవ సంవత్సరం పదవీలో కొనసాగనున్నారు. ముందుగా ఈడీ డైరెక్టర్‌ నియామకం, పదవీకాలాన్ని నియంత్రించే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) చట్టంలోని సెక్షన్‌ 25ను సవరిస్తూ గతేడాది కేంద్రం ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈడీ డైరెక్టర్ పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here