పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర నూతన గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్‌ నియామకం

Veteran Bureaucrat CV Ananda Bose Appointed as the New Governor of West Bengal,Veteran Bureaucrat CV Ananda Bose,CV Ananda Bose IAS,Former IAS CV Ananda Bose,Mango News,Mango News Telugu,CV Ananda Bose West Bengal New Governor,West Bengal New Governor,West Bengal New Governor CV Ananda Bose,CV Ananda Bose,CV Ananda Bose Latest News And Updates, West Bengal Governor,West Bengal Governor CV Ananda Bose, Keralaite CV Ananda Bose IAS

పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర నూతన గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్‌ నియమితులయ్యారు. “పశ్చిమ బెంగాల్ రెగ్యులర్ గవర్నర్‌గా డాక్టర్ సీవీ ఆనంద బోస్‌ను నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది” అని గురువారం రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా వ్యవహరించిన జగదీప్‌ ధన్కర్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి పశ్చిమబెంగాల్ అదనపు బాధ్యతలను మణిపూర్ గవర్నర్ లా గణేశన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే లా గణేశన్ స్థానంలో బెంగాల్ రెగ్యులర్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రాట్‌ డాక్టర్ సీవీ ఆనంద బోస్‌ నియమితులయ్యారు.

కాగా జగదీప్ ధన్కర్ బెంగాల్ గవర్నర్ గా ఉన్న సమయంలో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆయనకు అనేక అంశాలపై భేదాభిప్రాయాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్‌ సీఎం మమతా బెనర్జీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు దేశంలో ప్రస్తుతం కేరళ, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి, గవర్నర్‌ల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here