యూపీ తొలివిడత అసెంబ్లీ ఎన్నికలు: 30 మంది బీజేపీ స్టార్ ‌క్యాంపెయినర్ల జాబితా ఇదే…

2022 Up Assembly Elections, 30 Star Campaigners for Upcoming Uttar Pradesh Phase-1 Assembly Elections, Aparna Yadav, BJP Releases List of 30 Star Campaigners for Upcoming Uttar Pradesh Phase-1 Assembly Elections, Mango News, UP assembly election 2022, UP Assembly Elections, Up Assembly Polls, UP Elections, UP Elections 2022, UP Elections 2022 Latest Update, UP Polls, Uttar Pradesh Assembly Elections, Uttar Pradesh Phase-1 Assembly Elections, Yogi Adityanath UP Assembly Elections

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 03, 07 తేదీల్లో 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు ఎన్నికల్లో గెలుపుకోసం విస్తృత ప్రచారానికి సిద్ధమయ్యాయి. కాగా తొలి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మొత్తం 30 మందితో కూడిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ బుధవారం నాడు విడుదల చేసింది.

ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, యూపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, రాధా మోహన్ సింగ్, ఎంపీ హేమమాలిని సహా తదితరులు ఉన్నారు. కాగా ఈ జాబితాలో యూపీ బీజేపీలో కీలక నేతలైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని, వరుణ్ గాంధీ, మేనకా గాంధీలకు చోటు లభించలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − twelve =