ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రప్రభుత్వం

Government bans onion exports, Govt bans export of all varieties of onions, Govt bans export of onion with immediate effect, Govt imposes ban on export of onions, Onion Export Ban, Onion Export Ban India, Onion Export Banned, onions, onions price, onions price today, Union Govt Bans Export of Onions

దేశంలో అన్ని రకాల ఉల్లిపాయలను ఎగుమతి చేయడం తక్షణమే నిషేధించబడిందని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ సెప్టెంబర్ 14, సోమవారం నాడు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దేశంలో ఉల్లిపాయల ధర పెరుగుతుండడంతో, ప్రజలకు ఉల్లిపాయల లభ్యతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో వరదలు రావడంతో ఉల్లి పంటలపై ప్రభావం పడడం, సరఫరాకు అంతరాయం కలగడంతో గతకొన్ని రోజులుగా ఉల్లిధర పెరుగుతూ పోతుంది. ఉల్లిపాయల ఎగుమతుల్లో భారత్‌ కీలకపాత్ర పోషిస్తుంది. శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్ మరియు మలేషియా సహా పలు దేశాలుకు భారత్ నుంచి ఉల్లిపాయలు ఎగుమతి అవుతుంటాయి. ఈ క్రమంలో దేశంలో ఉల్లి లభ్యత దృష్ట్యా కేంద్రప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 2 =