ఇక యూపీలో మంత్రులే ఆదాయపన్ను చెల్లించాలి

1981 Act Provision, Allowances and Miscellaneous Act, latest political breaking news, national news headlines today, national news updates 2019, National Political News 2019, State Ministers To Pay Own Taxes, Suresh Kumar Khanna, the Finance Minister of UP, UP Government Scraps 1981 Act Provision, UP Government Scraps 1981 Act Provision State Ministers To Pay Own Taxes

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెప్టెంబర్ 13న, దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలో మంత్రుల ఆదాయపు పన్ను చెల్లించే విధాన నిబంధనను రద్దు చేసారు. 1981 సంవత్సరంనుంచి ఉత్తరప్రదేశ్ లో మంత్రుల ఆదాయపు పన్ను ను ప్రభుత్వమే భరించేలా నిబంధనను కొనసాగిస్తున్నారు. అయితే ఆదాయపు పన్ను ప్రభుత్వమే చెల్లిస్తునట్టు చాలామంది నాయకులకు తెలియకపోవడం విశేషం. 1981 లో వీపీ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కువమంది సభ్యులు పేదలవడంతో వారి ఆదాయపన్నును ప్రభుత్వమే చెల్లించేలా చట్టం తెచ్చారు.

ముఖ్యమంత్రులుగా పని చేసిన మాయావతి, అఖిలేష్ యాదవ్ హయాంలో పాటు, ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హయాంలో కూడ ఇదే విధానాన్ని కొనసాగించారు. ఒక వార్తా సంస్థ ఈ విషయం బయటపెట్టడంతో సామాన్య ప్రజానీకం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం సంవత్సరాల నాటి చట్టాన్ని రద్దు చేసింది. ఇక నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రులందరూ తమ పన్నులును వారే చెల్లించాలి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని యుపి ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు. 2018 సంవత్సరానికి గాను మంత్రులకు, ముఖ్యమంత్రి కి కలిపి రూ.86 లక్షల టాక్స్ చెలించినట్టు ఒక ఆర్ధిక శాఖ అధికారి తెలిపారు.

 

[subscribe]
[youtube_video videoid=Jobwc5PdG_E]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + seventeen =