తెలంగాణ సాధనకై అసువులు బాసిన అమరుల త్యాగఫలితమే నూతన సచివాలయం: సీఎం కేసీఆర్

CM KCR Visited and Reviewed the Progress of Telangana New Secretariat Works which are Reaching Final Stage,Telangana New Secretariat,CM KCR Visited New Secretariat,Telangana Secretariat,Mango News,Mango News Telugu,KCR Reviewed Progress of New Secretariat,Telangana Secretariat Works,Telangana Secretariat Works Final Stage,Telangana Secretariat Work,New Telangana Secretariat,Telangana Secretariat Latest News And Updates,Telangana News And Updates

నూతనంగా నిర్మితమౌతున్న డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగఫలితమేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడింపచేసే దిశగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంటున్నదని సీఎం తెలిపారు. తుది దశకు చేరుకుంటున్న తెలంగాణ సచివాలయ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ గురువారం పర్యవేక్షించారు.

సచివాలయం ప్రధాన ద్వారం దగ్గరునుంచి పైఅంతస్తు వరకు పరిశీలించిన సీఎం, వర్క్ ఏజెన్సీలకు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. ప్రధాన ద్వారం ఎలివేషన్ సహా, ఇటీవల బిగించిన డోములను, దోల్ పూర్ స్టోన్ తో రూపొందించిన వాల్ క్లాడింగ్ తదితర అలంకరణలను సీఎం కలియతిరిగి పరిశీలించారు. సచివాలయానికి ఉత్తర దక్షిణ భాగాల్లో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారాలను, కాంపౌండ్ వాల్స్ ను, వాటికి అమరుస్తున్న రైలింగులను, సుందరంగా రూపుదిద్దుకుంటున్న వాటర్ ఫౌంటేన్లను, లాన్ లను, స్టేర్ కేస్ లను సీఎం క్షుణ్ణంగా పరీక్షించారు. సీఎం, మంత్రులు సహా ఉన్నతాధికారులు సిబ్బంది సందర్శకుల వాహనాల ప్రవేశ ద్వారాలను పార్కింగు స్థలాలను తుది దశకు చేరుకుంటున్న వాటి నిర్మాణాలను సీఎం పరిశీలించారు.

మంత్రుల ఛాంబర్లను వారి సెక్రటరీలు సిబ్బంది కార్యాలయాలను పరిశీలించారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతూ, సమర్థవంతంగా గుణాత్మకంగా పనితీరును కనబరిచే విధంగా చాంబర్లు నిర్మితమౌతున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. విశాలవంతమైన కారిడార్లను, ఛాంబర్లను పరిశీలించి, మంత్రులు వారి సిబ్బంది ఒకే చోట విధి నిర్వహణ చేసే విధంగా అనుకూలంగా వుందని సీఎం వివరించారు. క్యాంటీన్లను, సమావేశ మందిరాలను పరిశీలించిన సీఎం తగు సూచనలు చేశారు. వాహనాల రాకపోకలకు అనుగుణంగా తను సూచించిన విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని సీఎం నిర్ధారించుకున్నారు. ఇటీవలే బిగించిన డోమ్ లను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. జీఆర్సీ పట్టీలను సీఎం పరిశీలించారు. సచివాలయం ప్రాంగణంలో హెలీప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించిన సీఎం అనువైన చోట నిర్మాణం చేపట్టాలన్నారు. అందరికీ అనువైన రీతిలో ఏర్పాటు చేస్తున్న డైనింగ్ హాల్స్, మంత్రులు అధికారులు కలెక్టర్ల కోసం ఏర్పాటు చేసిన సమావేశ మందిరాలను సీఎం పరిశీలించి తగు సూచనలు చేశారు. సిబ్బందికి సందర్శకులకు అసౌకర్యం కలగకుండా అన్ని చోట్లా లిఫ్టుల నిర్మాణం చేపట్టడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది కార్యాలయాలు సహా అడుగడుగునా కదలికలను పసిగట్టే సిసి కెమెరాల ఏర్పాటు పటిష్టమైన భధ్రత ఏర్పాట్ల దిశగా చేపట్టిన చర్యలను పరిశీలించారు. రికార్డులను భధ్రపరిచే స్ట్రాంగు రూంల నిర్మాణాలను, జాతీయ అంతర్జాతీయ అతిథుల కోసం నిర్మించిన సమావేశ మందిరాలను సీఎం పరిశీలించారు.

గత వంద ఏండ్లనుంచి ఇంతపెద్ద మొత్తంలో దోల్ పూర్ స్టోన్ ను వాడిన కట్టడం దేశంలో తెలంగాణ సచివాలయమేనని అధికారులు సీఎంకు వివరించారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇంతటి గొప్ప స్థాయిలో సచివాలయ నిర్మాణం జరగలేదని తెలిపారు. పార్లమెంట్ తరహాలో నిర్మాణం చేస్తున్న లోపల, బయట టెర్రకోటా వాల్ క్లాడింగును సీఎం పరిశీలించారు. అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న సచివాలయ నిర్మాణ కౌశలాన్ని, ఉద్దేశ్యాన్ని తనవెంట వచ్చిన ప్రజాప్రతినిధులకు సీఎం వివరించి చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,‘‘తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునే విధంగా సచివాలయానికి ఎదరుగా అమర వీరుల స్థూపం నిర్మాణమౌతున్నది. ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా బీదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే వారి అభివృద్ధే లక్ష్యంగా, అంబేద్కర్ పేరును సార్థకం చేసే విధంగా, తెలంగాణ సచివాలయానికి డా.బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టుకున్నాం. సచివాలయం పక్కనే నిర్మాణం అవుతున్న అత్యంత ఎత్తయిన డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎప్పడికప్పడు తమ కర్తవ్య నిర్వహణను గుర్తు చేస్తూ వుంటది. అమరుల త్యాగాలు, అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో భావి తరాల బంగారు భవిష్యత్తు దిశగా, తెలంగాణ వున్నన్నాల్లూ సచివాలయంలో విధి నిర్వహణ కొనసాగుతుందని సీఎం తన ఆశాభావాన్ని ప్రకటించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో వుంచుకునే సచివాలయం నిర్మాణం అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంటున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క్ సుమన్, దానం నాగేందర్, కంచర్ల భూపాల్ రెడ్డి, మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రియాంకా వర్గీస్, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్ అండ్ బి సెక్రటరీ శ్రీనివాస రాజు, ఈఎన్సీ రవీందర్ రావు, వర్క్ ఏజెన్సీల ఇంజనీర్లు ఆర్ అండ్ బి అధికారులు, తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =