పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు…రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ అరెస్ట్

West Bengal BJP President Sukanta Majumdar Arrested For Attempting To Visit Howrah Today, West Bengal BJP President Arrested For Attempting To Visit Howrah Today, BJP President Sukanta Majumdar Arrested For Attempting To Visit Howrah Today, Sukanta Majumdar Arrested For Attempting To Visit Howrah Today, West Bengal BJP president arrested for attempting to visit Howrah violence-hit areas, Howrah violence-hit areas, Sukanta Majumdar was arrested, West Bengal BJP President Sukanta Majumdar Arrested, West Bengal BJP President Arrested, BJP President Sukanta Majumdar Arrested, West Bengal BJP President Sukanta Majumdar, West Bengal BJP President, Sukanta Majumdar, Howrah violence-hit areas News, Howrah violence-hit areas Latest News, Howrah violence-hit areas Latest Updates, Howrah violence-hit areas Live Updates, Mango News, Mango News Telugu,

పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ సుకాంత మజుందార్‌ను పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ఈరోజు హౌరాలో పర్యటించేందుకు ప్రయత్నించినందుకు మజుందార్‌ను ఉత్తర దినాజ్‌పూర్‌లోని బలూర్‌ఘాట్ మజుందార్‌ను విద్యాసాగర్ సేతుపై ఉన్న టోల్ ప్లాజా దగ్గర అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. హౌరాలో సీఆర్‌పీసీ 144 సెక్షన్ కింద నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయని, ఆ ప్రాంతంలో పర్యటించేందుకు సుకాంతకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఆయన పర్యటన వలన హౌరాలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తుగా అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

దీనిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘వారు నన్ను మా ఇంటి వద్ద ఆపారు. నన్ను గృహనిర్బంధంలో ఉంచారు. తరువాత, వారు నన్ను నా నివాసం నుండి వెళ్ళడానికి అనుమతించారు. ఇప్పుడు విద్యాసాగర్‌ సేతుపై నన్ను ఆపి అరెస్టు చేశారు. సిఆర్‌పి సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీసులు చెబుతున్నారు’ అని మీడియాతో అన్నారు. ఇటీవల మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన బీజేపీ ప్రతినిధి నూపర్ శర్మను అరెస్టు చేయాలన్న డిమాండ్‌పై శుక్రవారం నాడు హౌరా జిల్లాలో తీవ్ర నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా కొన్ని హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఘటనలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండిచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 7 =