కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై 17 ఏళ్లకే ఓటర్‌ కార్డు దరఖాస్తుకు అవకాశం

India Election Commission Allows Citizens Above 17 Years To Apply For Voter ID Card in Advance, ECI Allows Citizens Above 17 Years To Apply For Voter ID Card in Advance, Citizens Above 17 Years To Apply For Voter ID Card in Advance, Voter ID Card, Citizens Above 17 Years, India Election Commission enables citizens above 17 years to apply for Voter ID card in advance, ECI permits citizens above 17 years to enrol for Voter ID Card, India Election Commission, Election Commission Of India, advance registration of voter list for youth, Election Commission of India Says Above 17 Years Citizens To Apply For Voter ID Card in Advance, Above 17 Years youngsters can apply for Voter ID cards in advance, ECI added 14.5 million new voters, Advance Voter ID cards, Mango News, Mango News Telugu,

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఓటర్‌ గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారు మాత్రమే ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఇకపై 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. 17 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ముందుగా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతనే వారికి ఓటర్‌ కార్డు అందనుంది.

ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌, ఎలక్షన్‌ కమిషనర్‌ అనుప్‌ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీ అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే జనవరి 1వ తేదీనే కాకుండా ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1వ తేదీలలో కూడా యువత ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈసీ. ఈ నేపథ్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఓటర్‌ జాబితాను అప్డేట్‌ చేయనున్నారు. 2022, ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త దరఖాస్తు ఫామ్స్ అందుబాటులో ఉంచనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆర్‌పీ యాక్ట్‌ 1950లోని సెక్షన్‌ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్‌ ఎలక్టోర్స్ రూల్స్‌, 1960 చట్టాలకు సవరణలు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =