డిసెంబర్ 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

Winter Session of Parliament will be held from December 7 to December 29,Winter Session Of Parliament ,Will Begin From December 7,Parliament Winter Session,Mango News,Mango News Telugu,Parliament'S Winter Session,Winter Session Of Parliament Dec7,Winter Session Of Parliament To Begin,Winter Session Parliament,17 Sittings Over 23 Days,Lok Sabha,Rajya Sabha,Parliament Winter Session 2022,Parliament Session 2022 Schedule Dates,Parliament Session 2022 End Date,Lok Sabha Next Session 2022,

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మొత్తం 17 పనిదినాలు ఉంటాయని చెప్పారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేస్తూ, “పార్లమెంటు శీతాకాల సమావేశాలు, 2022 డిసెంబర్ 7 నుండి ప్రారంభమై డిసెంబర్ 29 వరకు 23 రోజుల పాటుగా 17 పని దినాల్లో సమావేశాలు జరుగుతాయి. ఈ అమృత్ కాల్ లో జరిగే సెషన్‌లో లెజిస్లేటివ్ బిసినెస్ మరియు ఇతర అంశాలపై చర్చలు సహా నిర్మాణాత్మక చర్చ కోసం ఎదురు చూస్తున్నాం” అని పేర్కొన్నారు.

చివరిగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18న ప్రారంభమై ఆగస్టు 8 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈసారి శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభలో కోవిడ్-19 నిబంధనలపై ఇంకా ప్రకటించాల్సి ఉంది. అలాగే రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్కర్ అధ్యక్షతన తొలిసారిగా రాజ్యసభ కార్యకలాపాలు జరగనున్నాయి. కాగా దేశంలో తాజా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు సహా ఇతర రాజకీయాల అంశాల దృష్ట్యా ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − six =