మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 ప్రారంభం, ఐదు జట్ల కెప్టెన్స్ వీళ్ళే…

WPL 2023 will Start From March 4th List of Captains of All 5 Teams,WPL 2023 will Start From March 4th,WPL Captains List of All 5 Teams,WPL All 5 Teams List 2023,Mango News,Mango News Telugu,Wpl 2023 Venue,Wpl 2023 Auction,Wpl 2023 Auction Date,Wpl 2023 Matches,Wpl 2023 Official Website,Wpl 2023 Players List,Wpl 2023 Squad,Wpl 2023 Teams,Wpl 2023 Tickets,Wpl Cricket 2023 Schedule,2023 Womens Premier League,WPL Teams and Captains 2023

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 ప్రారంభానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవలే బీసీసీఐ డబ్ల్యూపీఎల్-2023 షెడ్యూల్‌ను ప్రకటించగా, డబ్ల్యూపీఎల్ ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4 నుండి 26 వరకు ముంబయిలో జరగనుంది. డబ్ల్యూపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ వంటి 5 ఫ్రాంచైజీలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ ముందు ఐదు ప్రాంఛైజీలు తమ కెప్టెన్ లను ప్రకటించాయి. ముంబయి ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా భారత్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా భారత్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్, గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ గా ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్-బ్యాటర్ బెత్ మూనీ, యూపీ వారియర్స్ కెప్టెన్ గా ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్-బ్యాటర్ అలిస్సా హీలీ నియమితులయ్యారు. అన్ని జట్లు కూడా పూర్తి ప్రణాళికలతో డబ్ల్యూపీఎల్ ద్వారా క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్‌ మొత్తం 23 రోజుల వ్యవధిలో జరగనుండగా, 20 లీగ్ మ్యాచ్‌లు మరియు 2 ప్లేఆఫ్ గేమ్‌లను నిర్వహించనున్నారు. మొత్తం 22 మ్యాచ్‌లు కూడా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం (11 మ్యాచులు) మరియు డీవై పాటిల్ స్టేడియం (11 మ్యాచులు) లోనే జరగనున్నాయి. డబ్ల్యూపీఎల్-2023 మార్చి 4, శనివారం డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ తో ప్రారంభం కానుంది. మార్చి 24న డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇక డబ్ల్యూపీఎల్-2023 ఫైనల్ మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం డబ్ల్యూపీఎల్ మ్యాచులు మధ్యాహ్నం 3:30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు జరగనున్నాయి. ముందుగా డబ్ల్యూపీఎల్-2023 వేలంలో 5 ఫ్రాంచైజీలు కలిపి 87 మంది క్రికెటర్లను కొనుగోలు చేశాయి. వీరిలో 57 మంది భారత్ ఉమెన్ క్రికెటర్లు కాగా, 30 మంది విదేశీ ఉమెన్ క్రికెటర్లు ఉన్నారు.

డబ్ల్యూపీఎల్-2023 కెప్టెన్స్:

  1. ముంబయి ఇండియన్స్ – హర్మన్‌ ప్రీత్ కౌర్
  2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – స్మృతి మంధాన
  3. ఢిల్లీ క్యాపిటల్స్ – మెగ్ లానింగ్
  4. గుజరాత్ జెయింట్స్ – బెత్ మూనీ
  5. యూపీ వారియర్స్ – అలిస్సా హీలీ.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + eighteen =