వీర్యం, అండం లేకుండానే పిండాన్ని సృష్టించిన ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు

Israeli Scientists Create Model of Human Embryo Without Sperm or Eggs,Israeli Scientists Create Model,Model of Human Embryo,Human Embryo Without Sperm or Eggs,Israeli Scientists,Mango News,Mango News Telugu,A stem cell, an embryo, Israeli scientists, created an embryo, without sperm, egg, sperm, woman's womb, laboratory Mr,Israeli Scientists Latest News,Israeli Scientists Latest Updates,Israeli Scientists Live News,Israeli Scientists Live Updates

ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు సృష్టికే ప్రతిసృష్టి చేసి అద్భుతం చేశారు. స్త్రీ, పురుషుల కలయికతో ఎటువంటి సంబంధం లేకుండానే పిండాన్ని సృష్టించారు. నిజానికి ఒక జీవి ప్రాణం పోసుకోవాలంటే అండం, శుక్రకణం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. అయితే ఏవో కొన్ని ఏకకణ జీవుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుంది. కానీ మనిషి పుట్టుకకు మాత్రం అండం, శుక్రకణం తప్పకుండా కలవాల్సిందే.

అయితే, ఇకపై వాటితో అవసరం లేకుండానే.. పిల్లలను పుట్టించవచ్చని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నిరూపించారు. జీవకణంతో మానవ పిండాన్ని సృష్టించేశారు. అదికూడా మహిళ గర్భంలో కాకుండా..ఓ ప్రయోగశాలలో సృష్టించారు. రెహోవొత్‌లోని వీజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన రీసెర్చర్స్ టీమ్.. ఈ విప్లవాత్మక ఆవిష్కరణ చేసింది. మనిషి మూలకణాన్ని ఉపయోగించి అచ్చంగా మానవ పిండాన్ని పోలిన ఆకారాన్ని వాళ్లు సృష్టించారు. ప్రయోగశాలలో ఈ పిండం14 రోజులపాటు పెరిగింది. తల్లిగర్భంలో పిండం రూపుదాల్చేటపుడు ..దాని ప్రారంభ దశ ఎలా ఉంటుందో.. ఈ ఆర్టిఫిషియల్ పిండం కూడా అచ్చం అలాగే ఉందని రీసెర్చర్స్ తెలిపారు.

సాధారణంగా ఎవరికైనా కూడా గర్భం దాల్చినప్పుడు మొదటి నెలలోనే ఎక్కువ సమస్యలు తలెత్తుతాయి. ఆ సమయంలోనే అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోనే అసలు గర్భం దాల్చిన మొదటి నెలలో పిండం పెరుగుదల ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఇజ్రాయెల్‌ పరిశోధకులు అనుకున్నారు. ముందుగా ఎలుకలపై ఈ అధ్యయనం చేసి సక్సెస్ అవడంతో ల్యాబరేటరీలో పిండం రూపొందించేందుకు పూనుకున్నారు.

మూలకాణాలను సేకరించి వాటిపై ముందుగా పరిశోధనలు చేశారు. ఓ కణం పిండంగా మారాలంటే ప్లాసెంటా, యోల్క్‌ శాక్‌, మెంబ్రెన్‌, అమ్నియోటిక్‌ శాక్‌ వంటివి అవసరమవుతాయి. దీని కోసం మూలకణానికి మొదటిగానే పిండంగా మారేలా ప్రోగ్రామింగ్‌ చేశారు. స్టెమ్ సెల్ పిండంగా మారడానికి 4 రకాల కణాలను, రసాయనాలను ఉపయోగించారు.

ఈ 4 రకాల కణాలలో ఫస్ట్‌వి ఎపిబ్లాస్ట్‌ కణాలు. ఇవే పిండంగా మారడానికి అవసరమవుతాయి. సెకండ్‌వి ట్రోపోబ్లాస్ట్‌ కణాలు.. ఇవేమో ప్లాసెంటాను ఉత్పత్తి చేస్తాయి. థర్డ్‌వి హైపోబ్లాస్ట్‌ కణాలు.. ఇవి పిండానికి కావాల్సిన యోల్క్‌ శాక్‌ను రూపొందించడానికి పని చేస్తాయి. ఇక ఫోర్త్‌ది మెస్మోడెర్మ్‌ కణాలు.. ఇవి అమ్నియోటిక్‌ శాక్‌గా మార్పు చెందుతాయి. అయితే 120 రకాల సెల్స్‌ను ఒకదానితో ఒకటి మిక్స్‌ చేయగా.. వాటిలో 1 శాతం మాత్రమే పిండంగా రూపాంతరం చెందింది. తర్వాత మానవులలాగే.. గర్భధారణ పరీక్ష చేసేందుకు వీలుగా హార్మోన్‌ను కూడా ఈ పిండం రిలీజ్ చేసినట్టు పరిశోధకులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here