డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో పాటుగా హిందూ ధర్మంపై సందేహాలకు వివరణ ఇస్తున్నారు. అలాగే వివిధ దేవాలయాలు/ప్రార్ధన మందిరాల్లో అనంత లక్ష్మి గారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో సందె ముగ్గు గురించి వివరించారు. ఇల్లు, వాకిలి రెండు చిమ్ముకుని ఇంటిముందు ముగ్గు వేయడాన్ని సందె ముగ్గు అంటారని చెప్పారు. ఇటీవల సాయంకాలం ముగ్గు వేసే అలవాటు లోపించిందని చెప్పారు. సందె ముగ్గు గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇