భోగాపురం సభలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్?

Joint Manifesto Release of TDP Janasena in Bhogapuram Sabha,Joint Manifesto Release of TDP Janasena,TDP Janasena in Bhogapuram Sabha,Release of TDP Janasena in Bhogapuram,TDP, Janasena, Manifesto, AP Politics, AP, Pawan kalyan,Mango News,Mango News Telugu,Preliminary Joint Manifesto For 2024,Jana Sena TDP joint manifesto,Naidu and Pawan Kalyan,Joint Manifesto Release Latest News,Joint Manifesto Release Latest Updates,Joint Manifesto Release Live News,Bhogapuram Sabha Latest News,Bhogapuram Sabha Live Updates
TDP, janasena, Menifesto, AP Politics, AP, Pawan kalyan

వైసీపీ సర్కార్‌ను ఎలాగైనా గద్దె దించాలని టీడీపీ, జనసేన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే ఎన్నికలపై ఫోకస్ చేసిన టీడీపీ, జనసేన.. ఎన్నికలవేళ అనుసరించాల్సి వ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి. అటు ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించేందుకు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా.. ఆయా రాష్ట్రాల్లో గెలుపొందిన పార్టీల మేనిఫెస్టోలోని పలు అంశాలను తీసుకొని సరికొత్త మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు.

అయితే ఉమ్మడి మేనిఫెస్టోను బుధవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ బుధవారం విజయనగరం జిల్లా భోగాపురంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జనాలను ఆకట్టుకునేలా.. అన్ని వర్గాలకు లాభం చేకూరేలా మేనిఫెస్టో ఉంటుందని తెలుస్తోంది.

కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చి విజయం సాధించింది. ఈక్రమంలో ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేలా ఈ హామీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చారట. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాల మహిళలకు నెలకు రెండు నుంచి మూడు వేల ఆర్థిక సాయం అందించేలా హామీని మేనిఫెస్టోలో చేర్చారట. రైతులకు లాభం చేకూరేలా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వనున్నారట. అయితే 2014 ఎన్నికల సమయంలో టీడీపీ రైతు రుణమాఫీ హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయింది. ఈక్రమంలో ఈసారి ఆ హామీని రైతులు నమ్ముతారా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

అటు యువత వ్యాపారం పెట్టుకునేందుకు పది లక్షల నిధుల కేటాయింపు హామీని కూడా మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది. అటు అన్నా క్యాంటీలను కూడా తిరిగి ఓపెన్ చేస్తామని హామీ ఇవ్వనున్నారట. అయితే ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ రద్దు చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వారి డిమాండ్ మాత్రం అలాగే ఉండపోయింది. ఈక్రమంలో ఈ డిమాండ్‌ను ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చుతారా?.. లేదా?.. అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో జనాలను ఎంత వరకు ఆకట్టుకుంటుంది?.. జనాల నుంచి ఆదరణ లభిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =