ఉద్యోగుల ఫ్యూచర్ లైఫ్ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. కంపెనీలు ఉద్యోగుల పేరుతో వారి ఈపీఎఫ్‌వో ఖాతాలో డబ్బు జమ చేస్తుంటాయి. అయితే ప్రభుత్వం దీని కోసం యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఒక ఉద్యోగి పొందే ప్రత్యేక నంబరు. దీనితో ఉద్యోగికి సంబంధించిన అన్ని పీఎఫ్ ఖాతాలు లింక్ అయి ఉంటాయి. ఒకరికి ఉద్యోగం మారినపుడల్లా పీఎఫ్ అకౌంట్ల నంబర్లు యాడ్ అవుతూనే ఉన్నా.. పాత నంబర్‌ను మాత్రమే ఉపయోగించాలి.
కొన్నిసార్లు యూఏఎన్ నంబర్‌ను మర్చిపోయి టెన్షన్ పడుతుంటారు. అలాంటప్పుడు ఇంట్లో కూర్చొని యూఏఎన్ నంబర్ తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ www.epfindia.gov.in లోకి వెళ్లాలి. ఈ వెబ్సైట్ హోమ్ పేజీలో సర్వీసెస్ ట్యాబ్‌లో ఉన్న ‘ఉద్యోగుల కోసం’ సెక్షన్లో ‘సభ్యుల యూఏఎన్/ ఆన్లైన్ సర్వీస్’పై క్లిక్ చేయాలి. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు కుడి వైపున ఉండే ముఖ్యమైన లింక్‌ల సెక్షన్లు కనిపిస్తాయి. అందులో ‘నో యువర్ యూఏఎన్’ అని రాసి ఉండే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
తర్వాత మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. తర్వాత యూఏఎన్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీ పేరు, పుట్టిన తేదీ, పీఎఫ్ మెంబర్ ఐడీ, ఆధార్ నంబర్ లేదా పాన్ నంబర్‌ను నమోదు చేయాలి.తర్వాత ‘షో మై యూఏఎన్’పై క్లిక్ చేస్తే.. యూఏఎన్ నంబర్ వివరాలు మీ మొబైల్ నంబర్‌కు వస్తాయి.
ఇది కాకుండా శాలరీ స్లిప్‌లో యూఏఎన్ నంబర్ ఎంటర్ చేయబడుతుంది. ఉద్యోగి పనిచేసే కంపెనీ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నంబర్ రూపొందించబడుతుంది. యూఏఎన్ నంబర్‌ను రూపొందించిన తర్వాత, ఉద్యోగి దానిని పర్మినెంట్‌గా ఉపయోగించాలి. యూఏఎన్ నంబర్ వచ్చాక కూడా ఇంకా యాక్టివేట్ కాకపోతే ..అది కూడా ఈజీగానే యాక్టివేట్ చేసుకోవచ్చు.ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌కి వెళ్లి, ‘ఫర్ ఎంప్లాయి ఆప్షన్’పై క్లిక్ చేయాలి.ఈ పేజీలో యూఏఎన్ లేదా ఆన్లైన్ సర్వీస్’ ఎంచుకోవాలి. తర్వాత యూనివర్సల్ ఖాతా సంఖ్య యాక్టివేట్ కొరకు యూఏఎన్ ఎంచుకోవాలి.
యూఏఎన్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ‘గెట్ ఆథరైజేషన్ పిన్’ ఎంటర్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. మీరు కండిషన్లకు అంగీకరిస్తున్నా అనే దానిపై క్లిక్ చేస్తే.. తర్వాత యూఏఎన్ యాక్టివేట్ అవుతుంది. సాధారణంగా యూఏఎన్ యాక్టివేషన్ కోసం 6 గంటల సమయం పడుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE