అనకాపల్లి నుంచి ఎంపీగా గుడివాడ అమర్నాథ్ పోటీ?

Gudivada Amarnath Contest As MP From Anakapalli,Gudivada Amarnath Contest ,Amarnath Contest As MP,MP From Anakapalli,Mango News,Mango News Telugu,gudivada amarnath, YCP, AP Elections, CM Jagan,Anakapalli Assembly constituency,Minister Gudivada Amarnath,Anakapalli Development,Gudivada Amarnath Latest News,Gudivada Amarnath Live Updates,Anakapalli Latest News
gudivada amarnath, YCP, AP Elections, CM Jagan

మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన సిట్టింగ్ స్థానమైన అనకాపల్లిని మరో వ్యక్తికి కేటాయించింది.  2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో చోటు కూడా దక్కించుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్‌కు టికెట్ ఇవ్వకుండా.. ఆ స్థానం నుంచి మలసాల భరత్ కుమార్ అనే కొత్త వ్యక్తిని వైసీపీ బరిలోకి దింపుతోంది.

ఈక్రమంలో గుడివాడ అమర్నాథ్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు కేటాయించేబోయే టికెట్‌కు సంబంధించి రకరకాల ఊహాగాణాలు తెరపైకి వచ్చాయి. ముందుగా అమర్నాథ్‌ను చోడవరం నుంచి బరిలోకి దింపుతారని గుసగుసలు వినిపించాయి. కానీ ప్రస్తుతం చోడవారానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ససేమిరా అన్నారు. ఈక్రమంలో అమర్నాథ్‌ను పెందుర్తి లేదా ఎలమంచిలికి షిఫ్ట్ చేయాలని జగన్ భావించారు. కానీ అక్కడ సామాజిక సమీకరణాలు అడ్డువస్తున్నాయి.

ఈక్రమంలో గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట. అమర్నాథ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత.  అనకాపల్లిలో కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ. అందుకే సామాజిక సమీకరణలు కూడా సరితూగుతాయని జగన్ ఆలోచిస్తున్నారు. ఇక అటు చూస్తే పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న జనసేన-తెలుగు దేశం పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నాయి.

ఇటీవల మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలోనే విపక్ష కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో రామకృష్ణ జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో రామకృష్ణను ఢీ కొట్టాలంటే అది గుడివాడ అమర్నాథ్‌తోనే సాధ్యమని జగన్ అనుకుంటున్నారట. ఆయన్ను అక్కడి నుంచి పోటీ చేయించడం ద్వారా ఖచ్చితంగా గెలిచి తీరుతారని భావిస్తున్నారట. త్వరలో విడుదల కాబోయే వైసీపీ అయిదో జాబితాలో కూడా అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్ పేరు ఉంటుందని తెలుస్తోంది.

అయితే గుడివాడ అమర్నాథ్ మాత్రం అసెంబ్లీ ఎన్నికలపైనే ఆశలు పెట్టుకున్నారట. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకే దిగుతానని హైకమాండ్ వద్ద పట్టుకొని కూర్చున్నాడట. మరి హైకమాండ్ అమర్నాథ్‌ను బుజ్జగించి అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దింపుతుందా? లేదా వేరే ఏదైనా అసెంబ్లీ స్థానాన్ని కట్టబెడుతుందా? అనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =