కొరియా ఓపెన్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన కశ్యప్

Parupalli Kashyap Enters Into Korea Open semi finals,Mango News,2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines,Parupalli Kashyap seals Korea Open,Korea Open semi finals,Korea Open Badminton 2019,Korea Open 2019,Parupalli Kashyap At Korea Open Semi Finals

కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్ లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తోటి భారత షట్లర్లు సాయిప్రణీత్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ తోలి రౌండ్లోనే వెనుదిరిగినా కశ్యప్ సత్తా చాటి పతకంపై ఆశలు సజీవంగా ఉంచుతూ సెమీఫైనల్లో ప్రవేశించాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో కశ్యప్ 24-22, 21-8 తో జాన్‌ జార్గెన్‌సెన్‌ (డెన్మార్క్‌)ను పై మంచి విజయం సాధించాడు. ఈ మ్యాచ్ ను కశ్యప్ కేవలం 37 నిముషాల్లోనే ముగించారు. తోలి గేమ్ హోరాహోరీగా 21నిమిషాలు పాటు సాగగా, రెండో గేమ్ కశ్యప్ అద్భుత ఆటతీరుతో 16 నిమిషాలపాటు ఏకపక్షంగా సాగింది. ఇక ఈ రోజు సెమీస్‌ పోరులో ప్రపంచ నంబర్‌ వన్‌ కెంటో మొమాటా (జపాన్‌)తో కశ్యప్ తలపడనున్నారు. 30వ ర్యాంకర్ కశ్యప్ గతంలో ప్రపంచ నంబర్‌ వన్‌ కెంటో మొమాటాతో రెండు సార్లు తలపడగా కెంటో మొమాటానే విజయం సాధించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here