‘అసాని’ తుఫాన్ ఎఫెక్ట్: తెలంగాణలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం

IMD Predicts Heavy Rains in Telangana For Next Two Days Due To Asani Cyclone, Heavy Rains in Telangana For Next Two Days Due To Asani Cyclone, For Next Two Days Heavy Rains in Telangana, Cyclone Asani Enters East Coast IMD Issues Rain Alert For AP Odisha And West Bengal, Cyclone Asani Enters East Coast, IMD Issues Rain Alert For AP, IMD Issues Rain Alert For Odisha, IMD Issues Rain Alert For West Bengal, IMD Severe Cyclone Asani Moves Towards Andhra Pradesh And Odisha States, Cyclone Asani Moves Towards Andhra Pradesh And Odisha States, Cyclone Asani Moves Towards Odisha States, Cyclone Asani Moves Towards Andhra Pradesh, IMD Warns Heavy Rainfall and Thunderstorm in Odisha-Andhra Pradesh Shore, IMD predicts heavy rainfall at isolated places over coastal Odisha And Andhra Pradesh, A heavy rainfall warning has been issued for Odisha And Andhra Pradesh, Odisha-Andhra Pradesh Shore, IMD Warns Heavy Rainfall in Odisha-Andhra Pradesh Shore, IMD Warns Thunderstorm in Odisha-Andhra Pradesh Shore, Heavy Rainfall in Odisha-Andhra Pradesh Shore, Thunderstorm in Odisha-Andhra Pradesh Shore, India Meteorological Department, India Meteorological Department Warns Odisha-Andhra Pradesh Shore, Odisha on High alert, coastal Odisha, Andhra Pradesh, Asani Cyclone, Asani Cyclone News, Asani Cyclone Latest News, Asani Cyclone Latest Updates, Asani Cyclone Live Updates, Mango News, Mango News Telugu,

అసాని తుఫాన్ కారణంగా రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను సంబంధిత ద్రోణి ఒకటి తెలంగాణ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల 48 గంటల పాటు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షాలు మరియు ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో అసాని తుఫాన్ కారణంగా తీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ కాకినాడకు ఆగ్నేయంగా 300 కి.మీ, విశాఖపట్నానికి 330 కి.మీ దక్షిణ ఆగ్నేయంగా, గోపాల్‌పూర్ (ఒడిశా)కి నైరుతి 510 కి.మీ (ఒడిశా) దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తీరా ప్రాంతం అంతా అల్లకల్లోలంగా మారింది. దీంతో విశాఖపట్టణం కేంద్రంగా నడవనున్న పలు విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. అనేక విమానాలను రద్దు చేశారు. అటు ఒడిశా రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 2 =