తెలంగాణాలో పార్టీలోకి చేరికలపై బీజేపీ హైకమాండ్​ ఫోకస్.. ఢిల్లీలో మకాం వేసిన బండి సంజయ్, ఈటల రాజేందర్

BJP High Command Focus on Joinings in Telangana Bandi Sanjay and Etala Rajender Meets Party Leaders in Delhi,BJP High Command Focus on Joinings in Telangana,Bandi Sanjay and Etala Rajender Meets Party Leaders,Etala Rajender Meets Party Leaders in Delhi,Mango News,Mango News Telugu,BJP High Command Special Focus,Bandi Sanjay Leaves For Delhi,Telangana Bandi Sanjay Latest News,Telangana Etala Rajender Latest News,Hope to Join BJP Again,Telangana BJP focus on inclusions,BJP Focus on Telangana Politics,Telangna BJP Party,Telangna BJP Party Latest News,Telangna BJP Party Latest Updates

తెలంగాణాలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. అధికార బీఆర్ఎస్ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల​లో ఉన్న అసంతృప్తులను చేర్చుకుని క్షేత్రస్థాయిలో బలం పుంజుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆ దిశగా చర్యలు చేపట్టిన బీజేపీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లను ఢిల్లీకి పిలిపించింది. అధిష్టానం నుండి పిలుపు రావడంతో హుటాహుటిన వీరు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బండి, ఈటల పలువురు పార్టీ ముఖ్య నేతలను కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరికలను వేగవంతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాడటం వంటివాటిపై పోరాటాలను మరింత ఉధృతం చేయాలనీ హైకమాండ్​ ఇరువురు నేతలకు సూచించినట్లు సమాచారం. కాగా ఇటీవల రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు చేరికలపై ఆరా తీశారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని, ఇతర పార్టీలనుంచి చేరికలను ప్రోత్సహించాలని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + thirteen =