బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం, తండ్రి మల్లయ్య మృతి

BJP MLA Eatala Rajender Father Eatala Mallaiah Passed Away, Eatala Mallaiah Passed Away, Eatala Mallaiah Passes Away, Eatala Mallaiah, BJP MLA Eatala Rajender Father Eatala Mallaiah, BJP MLA Eatala Rajender, MLA Eatala Rajender, Eatala Rajender, Huzurabad BJP MLA Eatala Rajender, Eatala Mallaiah News, Eatala Mallaiah Latest News And Updates, Eatala Mallaiah Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇంట విషాదం నెలకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈటల రాజేందర్‌ తండ్రి ఈటల మల్లయ్య మృతి చెందారు. ఆయన వయస్సు 104 సంవత్సరాలు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లయ్యకు హైదరాబాద్‌ లోని ఆర్వీఎం ఆసుపత్రి మెడికల్‌ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మల్లయ్య ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. అనంతరం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని స్వగృహానికి ఆయన మృతదేహాన్ని తరలించారు.

ఈటల మల్లయ్యకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు కాగా, ఈటల రాజేందర్‌ ఆయనకు రెండో కొడుకు. ఈటల రాజేందర్ ట్వీట్ చేస్తూ, “మా నాన్నగారు శ్రీ ఈటల మల్లయ్య గారు 24.08.22 తెల్లవారుజామున 1.17 గంటలకు తుదిశ్వాస విడిచారని తెలియజేయడానికి చింతిస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కమలాపూర్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నాము” అని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =