తెలంగాణలో ఆన్‌లైన్ క్లాసులు, ఏ తరగతి వారికీ ఎన్ని గంటలంటే?

Guidelines Online Classes, Intermediate Online Classes, Online Classes For Inter Degree PG Students, Online Classes For Intermediate Students, Online Classes for Students, Online classes for Telangana government schools, Online Classes in Telangana, telangana, Telangana Govt, Telangana Guidelines Online Classes, Telangana Online Classes

తెలంగాణలో అన్ని ప్రభుత్వ పాఠశాలల మరియు కాలేజీల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 2 వ తరగతి వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించట్లేదని పేర్కొన్నారు. 3 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు మాత్రమే ఆన్‌లైన్‌ తరగతులు జరగనున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా పాఠాలను బోధించనున్నారు.

ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ మార్గదర్శకాలు:

  • కిండర్‌గార్డెన్‌, నర్సరీ, ప్లేస్కూల్‌, ప్రీస్కూల్‌ విద్యార్థులకు వారంలో మూడు రోజులు – రోజుకు 45 నిముషాలు మాత్రమే (పెద్దలు లేదా తల్లిదండ్రుల సమక్షంలో)
  • 1 నుంచి 5 వ తరగతి విద్యార్థులకు వారంలో ఐదు రోజులు – రోజుకు రెండు తరగతులు – గరిష్టంగా గంటన్నర – ఒక్కో పాఠం 45 నిముషాలు మించరాదు
  • 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వారంలో ఐదు రోజులు – రోజుకు మూడు తరగతులు – గరిష్టంగా రెండు గంటలు – ఒక్కో పాఠం 30 నుంచి 45 నిముషాలు మించరాదు
  • 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు వారంలో ఐదు రోజులు – రోజుకు నాలుగు తరగతులు – గరిష్టంగా మూడు గంటలు – ఒక్కో పాఠం 30 నుంచి 45 నిముషాలు మించరాదు

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 3 =