నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 833 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్

TSPSC Issues Notification of Recruitment to 833 Vacancies in Various Engineering Services, Tspsc Notifies 833 Assistant Engineer, Technical Officer Posts, TSPSC 833 Vacancies, 833 Vacancies Engineering Services, Tspsc Notification, Mango News, Mango News Telugu, Telangana Public Service Commission, TSPSC Recruitment 2022, TSPSC Notification For Engineer Jobs, TSPSC JTO Notification 2022 , TSPSC AE Notification 2022, TSPSC Notification Latest News And Updates

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడింది. రాష్టంలో వివిధ ఇంజినీరింగ్ సర్వీసులకు సంబంధించి 833 అసిస్టెంట్ ఇంజినీర్‌, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్‌ మరియు టెక్నికల్ ఆఫీసర్, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల విభజన, వయస్సు మరియు స్కేల్ ఆఫ్ పే, కమ్యూనిటీ, విద్యార్హతలు మరియు ఇతర వివరణాత్మక సూచనలతో కూడిన పూర్తి నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 23వ తేదీన టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్‌ 21 వరకు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

పోస్టులు – శాఖ – ఖాళీలు:

 1. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌) – పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మిషన్ భగీరథ – 62
 2. అసిస్టెంట్ ఇంజినీర్‌ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి – 41
 3. అసిస్టెంట్ ఇంజినీర్‌ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్-పబ్లిక్ హెల్త్ – 13
 4. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్‌ (సివిల్) – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్-పబ్లిక్ హెల్త్ – 29
 5. టెక్నికల్ ఆఫీసర్ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్-పబ్లిక్ హెల్త్ – 09
 6. అసిస్టెంట్ ఇంజినీర్‌ – గిరిజన సంక్షేమ శాఖ – 03
 7. అసిస్టెంట్ ఇంజినీర్‌ – ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ – 227
 8. అసిస్టెంట్ ఇంజినీర్‌ (సివిల్) – గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ – 12
 9. అసిస్టెంట్ ఇంజినీర్‌ – రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ – 38

జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు (399):

 1. జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ – పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మిషన్ భగీరథ – 27
 2. జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ – పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి – 68
 3. జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్-పబ్లిక్ హెల్త్ – 32
 4. జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ – ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ – 212
 5. జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ – రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ – 60

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − three =