పవర్ ఫుల్ స్ట్రాటజీతో మెజార్టీ ఓట్లపై కన్ను

BRS Focus On Lok Sabha Elections, BRS Focus, Lok Sabha Elections BRS, BRS Party, Majority Votes, Strategy, Lok Sabha Elections, BRS Focus, Latest BRS Lok Sabha Elections News, Lok Sabha Elections News Update, BRS, KCR, KTR, Telangana, BRS, Congress, Mango News, Mango News Telugu
BRS Party,BRS focus on Lok Sabha elections, majority votes ,strategy,Lok Sabha elections

శాసనసభ ఎన్నికల్లో తమకు ఎదురైన ఓటమి నుంచి కోలుకుని .. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడానికి  బీఆర్‌ఎస్ రెడీ అవుతోంది.  ఇప్పటి నుంచే దీనికోసం తమ వ్యూహాలకు పదును పెడుతూ   ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే చేవేళ్ల లోక్‌ సభ స్థానానికి సంబంధించి సమీక్షను కూడా  నిర్వహించింది. మరోసారి కూడా రంజిత్ రెడ్డినే  చేవేళ్ల నుంచి పోటీ చేయించడానికి పార్టీ అధిష్టానం సిద్ధం అయింది.

అంతేకాకుండా తెలంగాణ భవన్‌లో జనవరి 3 నుంచి  లోక్‌సభ ఎలక్షన్స్ కోసం తమను తాము సిద్ధం చేసుకోవడానికి  వరుస సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి   కూడా  బీఆర్ఎస్ ‌కు గట్టి  పోటీ ఉంటుందని.. కార్యకర్తలంతా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,  మాజీ  మంత్రి కేటీఆర్  ఆ పార్టీ నాయకులకు సూచించారు.

చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై మరోసారి కూడా గులాబీ జెండానే  ఎగరాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.  బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా అంతా పని చేయాలని కేటీఆర్ సూచించారు. దీనికి అవసరమైన చర్యలు పార్టీ నేతలు  తీసుకోవాలని కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ సుమారు 98వేల ఓట్ల లీడ్ ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. అదేస్థాయిలో రానున్న పార్లమెంట్​ ఎన్నికల్లోనూ  పనిచేయాలని చేవెళ్ల ప్రజాప్రతినిధులకు కీలక నాయకులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి  రంజిత్ రెడ్డి పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి , బీజేపీ నుంచి జనార్థన్ రెడ్డి  బరిలో ఉండగా వారిద్దరినీ  ఓడించి రంజిత్ రెడ్డి విజయం సాధించారు. రంజిత్ రెడ్డికి  ఈ ఎన్నికల్లో  14వేల మెజార్టీ వచ్చింది. అయితే ఈసారి కూడా రంజిత్ రెడ్డినే అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్.

ఇక బీజేపీ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి బరిలో దిగుతారని తెలుస్తోంది. అయితే ఈ సారి  కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది.  ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన కాంగ్రెస్.. ఎలా అయినా  ఇక్కడ విజయం సాధించాలని  గట్టిగా ప్రయత్నిస్తోంది.…  పైగా చేవెళ్ల నియోజకవర్గ బాధ్యులుగా సీఎం రేవంత్ రెడ్డే ఉన్నారు.  దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో  చేవెళ్ల అత్యంత హాట్ సీటుగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 18 =