రేపే బీఆర్ఎస్ మేనిఫెస్టో.. ఆ వర్గాలకు ప్రాధాన్యత

BRS Manifesto tomorrow priority for those communities,BRS Manifesto tomorrow,priority for those communities,BRS Manifesto,Mango News,Mango News Telugu,telangana assembly elections, brs menifesto, brs, cm kcr, telangana politics, ktr, congress, bjp,telangana assembly elections Latest News,telangana assembly elections Latest Updates,telangana assembly elections Live News,telangana politics News Today,telangana politics Latest News
telangana assembly elections, brs menifesto, brs, cm kcr, telangana politics, ktr, congress, bjp

అందరికంటే ముందే ఎన్నికల కదనరంగంలోకి దూకేశారు గులాబీ బాస్ కేసీఆర్. ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే.. తమ అభ్యర్థులను ప్రకటించేశారు. ఎన్నికల రేస్‌లో తమ క్యాండిడేట్లను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే అనారోగ్య సమస్యల వల్ల కొద్దిరోజులుగా ఇంటిపట్టునే ఉంటున్న కేసీఆర్.. రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. వరుసగా బహిరంగ సభలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆదివారం హుస్నాబాద్ వేదికగా జరగబోయే బహిరంగ సభలో ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. అదే సభ వేదికగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను కూడా కేసీఆర్ ప్రకటించనున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌తో పాటు ఆరు గ్యారెంటీలను ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచింది. ఈక్రమంలో బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఈ మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోను గులాబీ నేతలు సిద్ధం చేశారు. హుస్నాబాద్‌లో జరగబోయే సభ వేదికగా కేసీఆర్ అధికారికంగా మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అయితే మహిళలకు పెద్ద పీఠ వేస్తామని.. అన్ని వర్గాల వారికి చోటు కల్పిస్తామని కేటీఆర్, హరీష్ రావులు మేనిఫెస్టోకు సంబంధించి పలు అంశాలను లీక్ చేశారు. దీంతో బీఆర్ఎస్ మేనిఫెస్టోపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ముఖ్యంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తలదన్నేలా మేనిఫెస్టో ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు.. ఇప్పటి వరకు ప్రకటించిన పథకాలతో పాటు.. ఓటర్లను ఆకట్టుకునేలా మరికొన్ని పథకాలను ఈసారి ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు, మహిళలను ఆకట్టుకునేలా కేసీఆర్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. రైతు బంధు, రైతు భీమా పథకాల ద్వారా రైతులకు ఇస్తున్న నగదు సాయాన్ని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. నిరుద్యోగులు, యువకులు, ఒంటరి మహిళల కోసం ప్రత్యేక పథకాలను రేపు కేసీఆర్ ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − six =