తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు ఖాయమా?

Is BJP and TDP alliance sure in Telangana,Is BJP and TDP alliance,alliance sure in Telangana,Mango News,Mango News Telugu,Amith Shah, bjp, BRS, Chandrababu Naidu, Kishan Reddy, modi, TDP, Telangana Assembly Elections, Telangana Politics, telangana assembly elections, telangana politics,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News,BJP and TDP alliance Latest News,BJP and TDP alliance Latest Updates
tdp, bjp, telangana assembly elections, telangana politics

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల రేస్‌లో దూసుకెళ్తోంది. అటు కాంగ్రెస్ కూడా రేపో.. మాపో తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కానీ బీజేపీ మాత్రం ఇంకా ఎన్నికల రేస్‌లో యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. అటు ఢిల్లీ పెద్దలను కూడా రంగంలోకి దింపినప్పటికీ బీజేపీ పరిస్థితిలో ఎటువంటి మార్పురాలేదు.

పరిస్థితి అనుకూలంగా లేకపోయినప్పటికీ.. బీజేపీ నేతలు మాత్రం ఎలా అయినా సత్తా చాటాలని ఆరాటపడుతున్నారు. ఇదే సమయంలో పొత్తు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ముందు నుంచి కూడా తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రచారం జరుగుతోంది. అప్పుడైనా బీజేపీ కాస్త ఉనికిని చాటుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ముందు నుంచి ఈ పొత్తును వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఏది ఏమైనా ఒంటరిగానే పోరాడుతామని చెబుతున్నారు.

ఇప్పుడు మరోసారి తెలంగాణలో బీజేపీ, టీడీపీల పొత్తు వ్యవహారం తెరపైకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఆగష్టులో జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అప్పటి నుంచే పొత్తుపై ఊహాగాణాలు వెలువడుతున్నాయి. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, పురంధేశ్వరిలు కూడా పాల్గొన్నారు. దీంతో ఇన్ని రోజుల నుంచి బీజేపీ, టీడీపీల పొత్తులపై వెలుడుతున్న ఊహాగాణాలకు బలం చేకూరినట్లు అయింది.

అయితే చంద్రబాబు నాయుడు జైలులో ఉండడంతో.. బీజేపీతో స్నేహం టీడీపీకి అత్యవసరం అయింది. దీంతో అమిత్ షాతో భేటీ సందర్భంగా పొత్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించాటర. తాము పొత్తుకు టీడీపీ రెడీగా ఉందని చెప్పారట. ఇటు తెలంగాణలో పలువురు బీజేపీ నేతలు ఈమాత్రం ఈ పొత్తును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం టీడీపీతో కలిసి పోటీ చేస్తే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తోందట. ఈక్రమంలో బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతోంది?.. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక తెలంగాణలో కూడా పోటీ చేయబోతున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 32 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు.. నియోజకవర్గాల పేర్లను కూడా ప్రకటించారు. అటు ఏపీలో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని జనసేనాని స్పష్టం చేశారు. బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి తెలంగాణలో టీడీపీ, బీజేపీ పార్టీలు పొత్తపెట్టుకుంటే.. జనసేన పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. జనసేన కూడా టీడీపీ, బీజేపీలతో కలుస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + eight =