జనవరి 3 నుంచి బీఆర్ఎస్ సన్నాహక సభలు

BRS Preparatory Meetings From January 3, BRS Preparatory Meetings, BRS Meetings From January 3, BRS Meetings, BRS, KCR, KTR, Parliament Elections, Latest BRS Meetings Update, BRS Parliament Elections, TS Parliament Elections, Parliament Elections News, Telangana, Congress, Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
BRS, KCR, KTR, Parliament elections

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరింది బీఆర్ఎస్ పార్టీ. అందరికంటే ముందే అభ్యర్థులను కదనరంగంలోకి దింపి.. గెలుపే లక్ష్యంగా పావులు కదిపింది. చివరికి వచ్చే సరికి రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఓటమి పాలయింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గద్దె దిగిపోయింది. ఈక్రమంలో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కంప్లీట్‌గా ఫోకస్ పెట్టింది. ఈసారి కూడా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.

మరో రెండు, మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈక్రమంలో బీఆర్ఎస్ కూడా ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు లోక్ సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ హైకమాండ్ నిర్ణయించింది. జనవరి 3 నుంచి తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.  లోక్ సభ ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. మొదట ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం సమావేశంతో సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ భవన్‌లో 4న కరీంనగర్‌, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్‌, 8న జహీరాబాద్‌, 9న ఖమ్మం, 10న వరంగల్‌, 11న మహబూబాబాద్‌, 12న భువనగిరి, 16న నల్గొండ, 17న నాగర్‌కర్నూల్‌, 18న మహబూబ్‌నగర్‌, 19న మెదక్‌, 20న మల్కాజ్‌గిరి, 21న సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరిలు సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + one =