ఆస్తి కోసం పేరెంట్స్‌ను తరిమేసిన గౌతమ్ సింఘానియా

Raymond Family Disputes, Raymond Disputes, Raymond Family Disputes, Raymond family,Gautham Singhania,Nawaz Modi Singhania, Vijay Path Singhania, Raymond, Latest Raymond News, Raymond News Updates, Raymond Brand, Raymond Family Issues, Raymond Pants, Raymond Shirts, Mango News, Mango News Telugu
Raymond Family Disputes , Raymond family?,Gautham Singhania,Nawaz Modi Singhania , Vijay Path Singhania

ఇప్పుడంటే ప్యాంట్లు, షర్టులలో రకరకాల బ్రాండ్లు ఎంట్రీ ఇచ్చాయి కానీ..ఒకప్పుడు బ్రాండెడ్ ఫార్మల్స్ అంటేనే రేమండ్ మాత్రమే గుర్తుకు వచ్చేది. ఒకప్పుడు ఫార్మల్ డ్రెస్సులలో రేమండ్ క్లాత్‌కు ఉన్న డిమాండే వేరు.ఇప్పుడు కూడా బ్రాండెడ్ లుక్ కోసం, ఆ రిచ్ నెస్ కోసం చాలామంది రేమండ్ ఫ్యాబ్రిక్‌కే తమ ఓటేస్తారు.

అంతెందుకు ఇప్పుడు ఇంతగా రెడీమెడ్ రంగం శాసిస్తున్న ఈ రోజుల్లోనూ రేమండ్ టెక్స్ టైల్ కంపెనీ ఇప్పటికీ టెక్స్ టైల్ రంగంలో నెంబర్ వన్ గానే ఉందంటే దాని వెనకున్న క్వాలిటీనే కారణం.

సూట్స్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది రేమండ్. ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో  200 సిటీలలో, 637 స్టోర్స్ లో, 4000 మల్టీ బ్రాండ్ ఔట్ లెట్స్, ప్రొడక్షన్ యూనిట్స్.. ఇలా అన్నీ కలిపి కొన్ని బిలియన్ డాలర్ల మార్కెట్ ను రేమండ్ కంపెనీ సొంతం చేసుకుంది. ఇప్పటికీ వేల కోట్ల లాభాలతో టెక్స్ టైల్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది.

ముందుగా విజయ్ పత్ సింఘానియా  రేమండ్ కంపెనీ పగ్గలు చేపట్టారు . ఆ తర్వాత రేమండ్ కంపెనీని కొడుకు గౌతమ్ సింఘానియా చేతిలో పెట్టి కోట్ల ఆస్తిని కూడా కొడుకుకు అప్పగించాడు. తండ్రి స్థాపించిన  కంపెనీని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి..కంపెనీని గౌతమ్ మరింత వృద్ధిలోకి తీసుకొచ్చాడు .

అయితే తల్లిదండ్రులను మాత్రం పట్టించుకోలేదు సరికదా ఆస్తి కోసం తల్లిదండ్రులను రోడ్డు మీదకు గెంటేశాడు. దీంతో తన కొడుకు గౌతమ్  మీద కేసు వేసిన విజయ్ పత్ సింఘానియా.. ప్రస్తుతం కోర్టులో న్యాయం కోసం పోరాడుతున్నాడు.

మరోవైపు గౌతమ్ భార్య నవాజ్ మోడీ సింఘానియా.. గౌతమ్‌పై కేసు వేస్తూ నవంబర్ 13న  కోర్టుకెక్కడం హాట్ టాపిక్ అయింది. ఆస్తి కోసం తన భర్త ..తన అత్తమామలను  బయటికి నెట్టేయడంతో.. అది నచ్చని గౌతమ్ భార్య.. తనకు విడాకులు కావాలని కోర్టుకెక్కింది. అత్తమామల తరపున ఆమె నిలబడటంతో ఎంతోమంది నవాజ్ మోడీని మనసారా అభినందిస్తున్నారు.

విజయ్ పత్ కు గౌతమ్ ఒక్కడే కాదు.. మరో కొడుకు కూడా ఉన్నాడు. కానీ.. ఆస్తుల గొడవ వల్ల.. పెద్ద కొడుకు విదేశాలకు వెళ్లిపోవడంతో గౌతమ్‌కే అన్ని ఆస్తులు దక్కాయి.అయితే విజయ్ పత్ ముంబైలో జేకే హౌస్ పేరుతో పెద్ద బిల్డింగ్ కట్టి అందులోనే ఉండేవారు.

ఆ బిల్డింగ్ లో ఒక ఫ్లాట్ లో విజయ్ పత్ సింఘానియా, మరో ఫ్లాట్ లో గౌతమ్ సింఘానియా, ఇంకో ఫ్లాట్ లో విజయ్ పత్ సోదరుడు, ఆయన పిల్లలు ఉండేవారు. అయితే.. ఆ ఇంట్లో ఉన్న మొత్తం నాలుగు డూప్లెక్స్ హౌసులు తనకే ఇచ్చేయాలని గౌతమ్ సింఘానికి తన తండ్రిని అడిగాడు.

కానీ అది  కుదరదని విజయ్ పత్ చెప్పడంతో తన తండ్రి మీదనే ఆరోపణలు చేసి తల్లిదండ్రులను బయటికి పంపించేశాడు గౌతమ్. అంతేకాదు అందులో ఉండే తమ బంధువులను కూడా ఖాళీ చేయించాడు. కొడుకు బయటకు గెంటేయడంతో.. విజయ్ పత్ ఇప్పుడు వేరే ఇంట్లో అద్దెకు ఉండాల్సిన  పరిస్థితి ఏర్పడింది. వేల కోట్లు సంపాదించి.. కొడుకు అత్యాశ వల్ల ఇప్పుడు ముంబైలో ఒక సాధారణ జీవితం గడిపే స్టేజ్ కు వెళ్లిపోయారు విజయ్ పత్.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − five =