తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్, భారీగా మోహరించిన పోలీసులు

AP Tension Prevails in Tadipatri During TDP Leader JC Prabhakar Reddy House Arrested Ahead of His Protest,AP Tension Prevails in Tadipatri,TDP Leader JC Prabhakar Reddy House Arrested,JC Prabhakar Reddy Arrested Ahead of His Protest,Mango News,Mango News Telugu,Tension in Tadipatri,High tension in Tadipatri,JC Prabhakar Reddy,JC House Arrested In Tadipatri,Tadipatri Latest News and Updates,Tadipatri Live News Today,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం (హౌస్ అరెస్ట్) చేశారు. కాగా పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం నిరసన చేపట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో ఇసుక తరలింపును పరిశీలించేందుకు వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనను పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకూడదంటూ హౌస్ అరెస్ట్ విధించారు. అలాగే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు అక్కడికి వెళ్లేందుకు మీడియాను సైతం అనుమతించడం లేదు. జేసీ నివాసం చుట్టుపక్కల కూడా బ్యారికేడ్లు పెట్టి టీడీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకుని రోడ్డుపైకి రావడంతో పోలీసులు ఆయనను ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసుల వైఖరిపై మండిపడ్డ జేసీ తాను పెన్నా నది ఇసుక రీచ్ వద్దకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. అయితే అందుకు పోలీసులు అనుమతిచక పోవడంతో పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైటాయించారు. దీంతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతగా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 17 =