కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో 6 జిల్లాలు రెడ్‌జోన్‌లో, 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో, 9 జిల్లాలు గ్రీన్‌జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు. మరి కొద్దీ రోజుల్లోనే ఆరెంజ్ జోన్ లో ఉన్న జిల్లాలన్నీ గ్రీన్ జోన్ లోకి వస్తాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ముందుగా ఆయా రాష్ట్రాల్లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, వైరస్ వ్యాప్తి చెందుతున్న విధానం, తదితర అంశాల ఆధారంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్లలో మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వం కొత్త జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 130 రెడ్ జోన్ జిల్లాలు, 284 ఆరెంజ్ జోన్ జిల్లాలు, 319 గ్రీన్ జోన్ జిల్లాలను గుర్తించినట్టు ప్రకటించారు.
తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ జిల్లాల జాబితా:
తెలంగాణాలో రెడ్ జోన్ జిల్లాలు:
- హైదరాబాద్
- సూర్యాపేట
- రంగారెడ్డి
- మేడ్చల్ మల్కాజిగిరి
- వికారాబాద్
- వరంగల్ అర్బన్
తెలంగాణలో ఆరెంజ్ జోన్ జిల్లాలు:
- నిజామాబాద్
- జోగులాంబ గద్వాల
- నిర్మల్
- నల్గొండ
- ఆదిలాబాద్
- కామారెడ్డి
- సంగారెడ్డి
- కొమరం భీం-అసిఫాబాద్
- ఖమ్మం
- కరీంనగర్
- మహబూబ్ నగర్
- జగిత్యాల
- రాజన్న సిరిసిల్ల
- జయశంకర్ భూపాలపల్లి
- మెదక్
- జనగాం
- నారాయణపేట
- మంచిర్యాల
తెలంగాణలో గ్రీన్ జోన్ జిల్లాలు:
- పెద్దపల్లి
- నాగర్ కర్నూల్
- ములుగు
- భద్రాద్రి కొత్తగూడెం
- మహబూబాబాద్
- సిద్దిపేట
- వరంగల్ రూరల్
- వనపర్తి
- యాదాద్రి భువనగిరి
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu