మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్, పర్యటన వివరాలివే…

CM KCR Delhi Tour, CM KCR Delhi Tour Latest Updates, KCR Delhi Tour, KCR Delhi Tour News, KCR Likely To Go Delhi Tour, Mango News, Telangana Chief Minister, Telangana Chief Minister to meet Gajendra Shekhawat, Telangana CM KCR, Telangana CM KCR Likely To Go Delhi Tour Again, Telangana CM KCR Likely To Go Delhi Tour Again on September 25th, Telangana CM KCR will leave for Delhi tomorrow, TRS party office in Delhi

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (సెప్టెంబర్ 24, శుక్రవారం) ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. రేపు ఉద‌యం ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన‌నున్నారు. అనంత‌రం జ‌రిగే బీఏసీ స‌మావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొని అసెంబ్లీ స‌మావేశాల ఎజెండాను ఖ‌రారు చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 25న కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్‌ తో సీఎం కేసీఆర్ స‌మావేశం కానున్నారు. అలాగే సెప్టెంబర్ 26వ తేదీన విజ్జానభవన్‌ లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో సీఎం స‌మావేశ‌మై చర్చించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 26న సాయంత్రం సీఎం కేసీఆర్ హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం కానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 8 =