ఏపీలో గ్రామస్ధాయిలోనే రిజిస్ట్రేషన్లు, త్వరలో 51 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు

AP Govt Decides to Start Registrations Process, AP Govt Decides to Start Registrations Process in 51 Village Secretariats, AP Govt Decides to Start Registrations Process in 51 Village Secretariats Soon, AP Village Secretariats, AP Village Secretariats Registrations, AP Village Secretariats Registrations Process, Mango News, Registrations In AP Village Secretariats, Registrations Process in 51 Village Secretariats, Registrations Process in Village Secretariats

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ శాఖ సేవలను మరింత వేగవంతం చేసే క్రమంలో గ్రామ స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే 51 గ్రామ సచివాలయాల్లో త్వరితగతిన రిజిస్ట్రేషన్ సేవల ప్రారంభంపై దృష్టి సారించాలని అధికారులకు రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సూచించారు. ముందుగా రాష్ట్రంలో గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలకు శ్రీకారం చుడుతూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, తక్కెళ్లపాడు గ్రామంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు.

ఈ నేపథ్యంలో 51 సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభిస్తున్నామన్నారు. ఎంపిక చేసిన 51 గ్రామ సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సేవలు అందించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రిజిస్టేషన్ల ప్రక్రియలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సచివాలయ కార్యదర్శులకు అందుకు సంబంధించి అవసరమైన పూర్తి స్దాయి శిక్షణను అందించనున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + four =